
"వాళ్ల సీక్రెట్స్ బయటపెడత"..మరికొద్ది గంటల్లో దీపిక పదుకొనే ప్రెస్ మీట్..ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది!?

దీంతో కోపంగా ఉన్న దీపిక తన పిఆర్ టీమ్ ద్వారా స్పిరిట్ స్టోరీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను బయటకు లీక్ చేయించిందనే గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఆ విషయమై సందీప్ రెడ్డి వంగకు సమాచారం చేరడంతో పరిస్థితి మరింత దిగజారింది. దాని ప్రభావం మరో భారీ ప్రాజెక్ట్ కల్కి 2 మీద కూడా పడింది. దీంతో ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేస్తూ, "ఇకపై దీపికా పదుకొనే మా ప్రాజెక్ట్‌లో భాగం కాదు" అని క్లారిటీ ఇచ్చేసింది. ఈ వరుస దెబ్బలతో దీపికా ఇమేజ్ బాగా దెబ్బతింది. "దీపికా హెడ్ వెయిట్ తగ్గిపోతుంది" అంటూ సోషల్ మీడియాలో నెట్టింటి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈ పరిస్థితుల్లో కూడా దీపిక ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా సోషల్ మీడియాలో పూర్తిగా సైలెంట్‌గా ఉండటం గమనార్హం. దీంతో ఆమె తన తప్పు గుర్తించిందని, అందుకే సైలెంట్‌గా ఉందని చాలామంది భావించారు.
కానీ బాలీవుడ్‌లో నుంచి తాజాగా మరో సంచలన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే – దీపికా నేడు ఓ ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తోందట. ఇందుకు సంబంధించిన పర్మిషన్ కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతోందని బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ అనుమతులు కుదిరితే మాత్రం, ప్రెస్ మీట్‌లో దీపిక స్వయంగా నిజానిజాలు బయటపెట్టబోతోందని సమాచారం. "ఎందుకు ఇంత నెగిటివిటీ తనపై పడింది?", "స్పిరిట్ సినిమాలో అసలు తప్పు ఎవరిది?", "తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?" అనే విషయాలపై ఆమె క్లారిటీ ఇవ్వబోతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆమె నోరు విప్పితే బడా స్టార్ సీక్రెట్స్ కూడా బయటపడే అవకాశం ఉందనే అంచనాలు పెరుగుతున్నాయి. దీనిపై దీపిక అభిమానులు కూడా ఘాటుగా స్పందిస్తూ, "దీపిక నోరు విప్పితే ఇండస్ట్రీలో పెద్ద కలకలం రేగుతుంది" అని సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి, దీపికా పదుకొనే – సందీప్ రెడ్డి వంగ మధ్య తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు కేవలం ఒక వ్యక్తిగత ఇష్యూ కాదని, ఇది సినీ ఇండస్ట్రీ మొత్తాన్నే కుదిపే మొత్తం దుర్మార్గానికి నాంది అవుతుందనే భావన అందరిలోనూ పెరుగుతోంది.