
ఇలాంటి సమయంలోనే ఆమెకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా వచ్చిన వార్తల ప్రకారం, ఆమె చీకటి కోణం బయటపడిందంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఒక హీరో విషయంలో ఆమె రెమ్యూనరేషన్ కారణంగా ఒకటి రెండు కాదు, ఏకంగా ఆరు సినిమాలు రిజెక్ట్ చేసిందట. ఆ హీరో మరెవరో కాదు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. జై హో, సుల్తాన్, కిక్, కరణ్ జోహార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “శుద్ధి”, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి పెద్ద సినిమాలలో ఆమెకు అవకాశాలు వచ్చాయట. అయితే, రెమ్యూనరేషన్ విషయంలో ఒప్పందం కుదరకపోవడంతో, ఈ సినిమాలు ఆమె చేతుల నుంచి జారిపోయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీంతో సోషల్ మీడియాలో దీపిక పదుకొనేపై ట్రోలింగ్ మరింత పెరిగింది. “తెలుగు ఇండస్ట్రీలోనే అనుకున్నాం నీ ఆటలు బాలీవుడ్‌లో కూడా చూపిస్తున్నావా? నీకు లైఫ్ ఇచ్చిన బాలీవుడ్ ఇండస్ట్రీ కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకోలేవా? ఛీ ఛీ నువ్వు ఇలాంటిదానివా" అంటూ చాలామంది ఘాటుగా టార్గెట్ చేస్తున్నారు.దీంతో సోషల్ మీడియాలో పదుకొనే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. “ఆమెను ఈ విధంగా టార్గెట్ చేసి ట్రోల్ చేయడం సమంజసం కాదు” అని వారు అంటున్నారు. మొత్తానికి కల్కి 2 ఎఫెక్ట్ దీపికా పదుకొనేపై బాగా పడింది. ఒకపక్క ప్రొఫెషనల్‌గా, మరొకపక్క పర్సనల్‌గా ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీన్నంతటినీ ఫుల్ స్టాప్ పడాలంటే దీపికే నోరు విప్పాలి. అసలు ఏమి జరిగింది? ఎందుకు ఆమెను కల్కి 2 నుంచి, స్పిరిట్ సినిమా నుంచి తీసేశారు? అన్న విషయాలను స్వయంగా ఆమె నోటితో బయటపెడితేనే ఈ ట్రోలింగ్‌కి ఫుల్‌స్టాప్ పడుతుంది.