ప్రస్తుతం ఓజీ సినిమాకి సంబంధించిన హంగామా సోషల్ మీడియాలో, థియేటర్ల దగ్గర, ఫ్యాన్స్ మధ్య అసలు ఆగట్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన ఈ సినిమా, రిలీజ్‌కు కొద్ది గంటల ముందే అంచనాలు ఆకాశాన్నంటింది. రిలీజ్ అయిన వెంటనే మాత్రం ఆ అంచనాలను మించి, సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించింది. మొదటి షో నుంచే అభిమానులు ఆశించిన విధంగానే ప్రతి సీన్ పవన్ కళ్యాణ్‌కు హైలైట్ అవ్వడంతో, ఆయనను మాస్ లెవెల్‌లో, ఆ కల్ట్ రేంజ్‌లో చూసిన ప్రేక్షకులు థియేటర్లలో పూనకాలతో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, నాన్ పవన్ ఫ్యాన్స్  కూడా ఈ సినిమాని బాగా లైక్ చేస్తూ, సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలతో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు.


ఇక ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్‌గా నటించిన శృతిహాసన్ అప్పట్లో లక్కీ బ్యూటీగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా వరకు శృతిహాసన్ కెరీర్‌లో పెద్ద హిట్స్ ఏమీ లేవు. కానీ ఒక్క గబ్బర్ సింగ్తోనే ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. అప్పటివరకూ వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలు ఒక్కసారిగా వరుసగా చేరి, ఆమె పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అదే తరహాలో ఇప్పుడు ఓజీ సినిమా విషయంలోనూ అలాంటి సిట్యూవేషన్ ప్రియాంక మోహన్ చుట్టూ క్రియేట్ అవుతోందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.



ప్రియాంక మోహన్ కూడా ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించినా, పెద్ద హిట్ హీరోయిన్ అని చెప్పుకునే స్థాయికి రాలేదు. కానీ ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించడం ఆమె కెరీర్‌కు ఓ మైలురాయిగా మారిపోయింది. సినిమాలో ఆమె స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ, వచ్చిన ప్రతి సీన్‌లోనూ ఆకట్టుకునేలా కనిపించింది. ముఖ్యంగా పవన్‌తో ఉన్న కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకుల మైండ్‌లో బాగా సెట్ అయ్యాయి. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు ఫ్యాన్స్ ఇలా అంటున్నారు – "గబ్బర్ సింగ్‌తో శృతిహాసన్‌కి స్టార్‌డమ్ ఇచ్చినట్టే, ఓజీతో ప్రియాంక మోహన్‌కి పవన్ కళ్యాణ్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఇవ్వబోతున్నాడు" అని మాట్లాడుకుంటున్నారు.



ఇక ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో, ప్రియాంక మోహన్ పేరు స్టార్ హీరోయిన్‌ల లిస్టులోకి చేరిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నుంచి ఆమెకి పెద్ద ప్రాజెక్టులు, స్టార్ హీరోలతో సినిమాలు ఖాయమని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే మరోసారి తన హీరోయిన్ కెరీర్‌ను బూస్ట్ చేస్తూ, లైఫ్ మార్చే అవకాశం ఇచ్చాడని అందరూ చెప్పుకుంటున్నారు.మొత్తానికి, ఓజీ సినిమా ప్రియాంక మోహన్ కెరీర్‌లో ఓ గోల్డెన్ చెప్టర్‌గా మిగిలిపోతుంది. తక్కువ పాత్ర నిడివి ఉన్నప్పటికీ, ఆ రోల్ ద్వారా ఆమె గుర్తింపు సంపాదించింది. ఈ అనుభవం ఆమె లైఫ్‌లో ఒక స్వీట్ మెమరీగా, ఫ్యాన్స్ మైండ్‌లో ఒక స్పెషల్ రిమైండర్‌గా ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: