
హీరో నాని ఈ సినిమాకి సంబంధించి ఎవరి మాటలు వినకండి ఓజి సినిమా బ్లాక్ బస్టర్ అంతే..ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ హీరో పవన్ కళ్యాణ్ గారు తమన్ మిగతా ఓజీ చిత్ర యూనిట్ అందరికీ నా అభినందనలు అంటూ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు..
ఇక ఈ సినిమాను థియేటర్లో చూసిన నిర్మాత నాగ వంశీ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఓజి సినిమా నిజంగానే ఒక ఫైర్ స్టోర్మ్ లాగా దూసుకెళ్లింది. పవన్ కళ్యాణ్ వచ్చే ఇంట్రో సీన్ అద్భుతం. పోలీస్ స్టేషన్ బ్లాక్, ఇంటర్వెల్ సేన్ ఇవన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించాయి. సినిమా చూస్తున్న ప్రతి సెకండ్ మైండ్ మ్యాడ్ నెస్ తో నిండిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రతి ఒక్క సీన్ ని తన మ్యూజిక్ బిజీఎంతో అదరగొట్టేసాడు.పవన్ కళ్యాణ్ సార్ ఆటిట్యూడ్,స్వాగ్ తో అభిమానులను అలరించాడు. ఇప్పుడే అసలైన హంగ్రీ చీతా వేట మొదలైంది. ఓజి చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు అంటూ నాగ వంశీ తనదైన శైలిలో ట్వీట్ పెట్టారు.
ఇక సినిమాను థియేటర్లో వీక్షించిన దర్శకుడు బాబి కూడా ఓజి మూవీ పై సెన్సేషనల్ రివ్యూ చేశారు. పవన్ కళ్యాణ్ ని దర్శకుడు సుజిత్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు.నిజమైన గ్యాంగ్ స్టర్ ని పెద్ద స్క్రీన్ మీద చూసినందుకు హ్యాపీగా అనిపిస్తుంది. పవర్ స్టార్ గారి యాక్టింగ్.. తమన్ మ్యూజిక్ ని మాటల్లో చెప్పలేం అంతే..బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూ ఇచ్చాడు.
ఇక నిర్మాత ఎస్కేఎన్ కూడా సినిమా చూసి ఓజి మూవీ దసరా టైంలో దీపావళిని తెచ్చింది..ఓజి సినిమా పక్కకా ఫ్యాన్ ఫీస్ట్.. పవన్ కళ్యాణ్ గారి కరిష్మాటిక్ ఆరా, గ్రేసియస్ ప్రజెన్స్ ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ సుజిత్ మైండ్ బ్లోయింగ్ మేకింగ్ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ మేకింగ్,తమన్ బిజిఎం రెండూ కలిసి ఓజి మూవీ ని స్టన్నింగ్ బ్లాక్ బస్టర్ గా మార్చేశాయి. యాక్షన్ బ్లాక్స్ లో పవన్ కళ్యాణ్ గారి పూనకాలు చూసి ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఓజి మూవీపై టాలీవుడ్ ప్రముఖుల పోస్టులతో సోషల్ మీడియా షేక్ అవుతుంది.