
ఆర్.ఆర్.ఆర్, ఓజీ సినిమాలతో నిర్మాత దానయ్య భారీ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ధన్యవాదాలు అని దానయ్య వెల్లడించారు. దానయ్య లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదని ఆయన తెలిపారు. కళ్యాణ్ సార్ తో సినిమా చేయాలని నేను అడిగినప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సుజీత్ పేరును సూచించారని దానయ్య పేర్కొన్నారు.
ఆ తర్వాత నేను దర్శకుడు సుజీత్ ని కలిశానని నిర్మాత దానయ్య పేర్కొన్నారు. దర్శకుడు సుజీత్ ఓజీ సినిమా కథ చెప్పారని దానయ్య పేర్కొన్నారు. పవన్ అభిమానులు, సినీ ప్రియుల అంచనాలకు అనుగుణంగా మేము చాలా కష్టపడ్డామని దానయ్య చెప్పుకొచ్చారు. థమన్, నవీన్ నూలి, రవి కె చంద్రన్ ఓజీ సినిమాకు మూలస్తంభాలు అని దానయ్య వెల్లడించారు. దానయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
నిర్మాత దానయ్య పరిమితంగా సినిమాలను నిర్మిస్తున్నా ఆ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానయ్య కొడుకు దాసరి కళ్యాణ్ అధీర సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సూపర్ హీరో ఫిల్మ్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎస్.జె సూర్య ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రశాంత్ వర్మ పారితోషికం సైతం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ రావాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. ప్రశాంత్ వర్మ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.