ఓజీ సినిమా విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ గురించిన పాత విషయాలు మళ్లీ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఆయన నటన, ఆయన పట్ల సినీ ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తుల వైఖరి గురించి పాత సంగతులన్నీ మళ్లీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ గతంలో వరుస ఫ్లాపుల కారణంగా ఎదుర్కొన్న విమర్శలు, ఆయనను పూర్తిగా లెక్కచేయని పరిస్థితులు ఇప్పుడు మరోసారి నెటిజన్లకు గుర్తుకొస్తున్నాయి.ఆ సమయంలో కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు పవన్ కళ్యాణ్‌ని పూర్తిగా విస్మరించారు. “ఇక పవన్ కళ్యాణ్‌ చాప్టర్ క్లోజ్.. ఆయన సినీ కెరీర్ ఇక ముగిసిందన్నట్టే” అని గట్టిగా వ్యాఖ్యలు చేశారు. కానీ, గడిచిన పది సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ అద్భుతంగా బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించారు. మొదట గబ్బర్ సింగ్‌తో బాక్సాఫీస్ వద్ద గర్జించి, ఆ తర్వాత అత్తారింటికి దారేది లాంటి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆయన స్టామినాను మరలా నిరూపించారు. ఈ విజయాల తర్వాత పవన్ కళ్యాణ్‌కి మార్కెట్, క్రేజ్, ఇమేజ్ అన్నీ పుంజుకున్నాయి.


అప్పుడే ఒక బడా నిర్మాత పవన్ కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి ఆయనకు బ్లాంక్ చెక్ పెట్టాడట. “మీరు ఎంత కావాలో రాసుకోండి.. మీరు చెబితే చాలు, నేను సినిమా చేస్తాను” అని చాలా హెడ్ వెయిట్  మాటలతో మాట్లాడాడట. అయితే పవన్ కళ్యాణ్ ఆ ఆఫర్‌ని అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే, ఆయనకి అప్పటికే ఆ నిర్మాత గతంలో తీరు గుర్తొచ్చింది. ఫ్లాప్‌ల సమయంలో తాను ఉన్న పరిస్థితిని చూసి అదే వ్యక్తి తనని ఎలా లెక్క చేయకుండా మాట్లాడాడో పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు.దాంతో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్‌గా చెప్పేశారట – “సినిమా అంటే కేవలం నా కోసం డబ్బు చేసుకోవడమే కాదు. ఇది మొత్తం 24 విభాగాలకు సంబంధించిన కళాకారులను బ్రతికించే వృత్తి. నాకు డబ్బు ముందుగా ఇచ్చేస్తానని, తర్వాత ఎలాగో ఒక డైరెక్టర్‌ని తీసుకుని సినిమా చేస్తామంటూ బిజినెస్ యాంగిల్‌తో వచ్చేవాళ్లతో నాకు పని లేదు.  నా సొంత స్థాయి, నా విలువ నాకు బాగా తెలుసు” అని చెప్పి ఆ బ్లాంక్ చెక్‌ని తిరిగి ఇచ్చేశారట.



ఈ సంఘటనలో పవన్ కళ్యాణ్ ఆ పెద్దమనిషి పెద్దరికాన్ని ఎంత పద్ధతిగా దించేశాడో అప్పట్లోనే చాలామంది షాక్ అయ్యారు. ఆయనకి సినిమా అంటే కేవలం స్టార్ ఇమేజ్ కాదు, ఒక వృత్తిగా ఉన్న విలువ, సమష్టిగా బ్రతికే పరిశ్రమ అనే విషయం తెలుసు అని మరోసారి నిరూపించారు. ఇప్పుడా విషయం మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓజీ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో, గతంలో పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న అవమానాలు, వాటిని ఆయన ఎలాంటి ధైర్యంతో తిప్పికొట్టారో ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఇదే కారణంగా పవన్ కళ్యాణ్ నిజమైన స్టార్, నిజమైన లీడర్ అనే అభిప్రాయం అభిమానుల్లో మరింత బలపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: