
ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్లో ప్రభాస్ తన కామెడీతో ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని హార్రర్ ఎలివేషన్స్ కూడా ట్రైలర్ కి హైలెట్గా నిలుస్తున్నాయి. అలాగే ప్రభాస్ , హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలెట్గా నిలుస్తున్నాయి. ఇందులో కొన్ని భయంకరమైన సన్నివేశాలను కూడా చూపించారు డైరెక్టర్ మారుతి. బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్ ఇందులో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక చివరిలో ప్రభాస్ చెప్పే డైలాగుతో ఇందులో డ్యూయల్ రోల్ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజా సాబ్ ట్రైలర్ తో మరింత ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ని ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ,బెంగళూరు వంటి ప్రాంతాలలో కూడా కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రత్యేకించి మరి విడుదల చేశారు. ట్రైలర్ కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రభాస్ ని చూపించిన స్క్రీన్ ప్రజెన్స్, థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కి ప్లస్ గానే మారింది. వాస్తవంగా డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కావలసి ఉండగా కానీ వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ట్రైలర్ ద్వారా ప్రకటించారు. మొత్తానికి ప్రభాస్ సరికొత్త రాజా సాబ్ గా కనిపిస్తున్నారు.