
ఓజీ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ పట్ల మెచ్చుకోకుండా ఉండలేరు. ఇప్పటికే ఆయన చేసిన సాహో, రన్ రాజా రన్ సినిమాలు ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇప్పుడు ఓజీతో మరొక స్థాయిలో ప్రేక్షకులను అలరించగలిగాడు. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఆస్వాదించారు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో సుజిత్ చూపిన విజన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. "క్లైమాక్స్‌లో ఏమి ఉంటుందో చూడాలి" అనే ఆసక్తి సినిమా రిలీజ్‌కి ముందు నుంచే పెంచేశాడు. రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలను మించిపోయేలా ఎమోషనల్, స్టైలిష్, మాస్ టచ్ కలిపి క్లైమాక్స్‌ని మాస్టర్ పీస్ గా మలిచాడు.
ఇప్పటి పరిస్థితుల్లో ప్రతి సినిమాకి సీక్వెల్‌లు వస్తున్నాయి. కానీ సీక్వెల్‌లో కూడా కొత్తగా, క్రియేటివ్‌గా ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తేనే అసలైన డైరెక్షన్ అని చెప్పుకోవాలి. ఆ విషయంలో సుజిత్ మైండ్‌సెట్‌కి ఇండస్ట్రీ సాల్యూట్ చెబుతోంది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే – ఓజీ సినిమా సీక్వెల్ అయిన ఓజీ 2 లో టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించబోతున్నాడు అన్న వార్త. ఈ వార్త బయటకు రాగానే ఇండస్ట్రీలో తెలియని ఎనర్జీ మొదలైంది. సర్ప్రైజ్ మూడ్ క్రియేట్ అయింది.
ఇకపోతే, నాగార్జున గారు లీడ్ రోల్స్‌తో పాటు గత కొంతకాలంగా స్పెషల్ నెగిటివ్ రోల్స్‌కి కూడా రెడీ అవుతున్నారు. కూలీ వంటి సినిమాల్లో కూడా ఆయన చేసిన నెగిటివ్ షేడ్స్ పాత్రలు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అదే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఓజీ 2లో మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ సుజిత్ ఆయనను అప్రోచ్ చేయగా నాగార్జున గారు కూడా వెంటనే ఓకే చేశారని టాక్. నిజంగానే ఈ వార్త కన్ఫర్మ్ అయితే మాత్రం, నాగార్జున గారు టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసినట్లే. ఒక సీనియర్ హీరో ఇంత స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా నెగిటివ్ రోల్‌లో కనిపిస్తే ఆ సినిమాకి ఎంత క్రేజ్ వస్తుందో చెప్పక్కర్లేదు. పైగా ఓజీ యూనివర్స్ లో భాగంగా నాగార్జున లాంటి స్టార్ విలన్ జాయిన్ అవ్వడం అంటే అభిమానులకి డబుల్ ఫీస్ట్ అనమాట.
ఇప్పటికే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ప్రేమికులు, అక్కినేని అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ కాంబినేషన్‌కి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు కూడా "ఇది నిజమైతే ఒక హిస్టారికల్ కాంబినేషన్ కుదిరినట్టే" అని కామెంట్ చేస్తున్నారు.మొత్తం మీద, నాగార్జున గారు ఓజీ 2లో విలన్‌గా కనిపిస్తే అది టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కే నాంది అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.