
పైరసీ అనే ఈ భూతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తరిమికొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. దీని కోసం ఇండస్ట్రీలో కొన్ని కఠినమైన కొత్త నియమాలను తీసుకురావాలని ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక సెన్సేషనల్ రూల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం బయటకొచ్చింది. అదేమిటంటే, ఇకపై థియేటర్లలోకి మొబైల్ ఫోన్లను అనుమతించకూడదని. ఎందుకంటే ప్రస్తుతం పైరసీ ఎక్కువగా జరుగుతున్న ప్రధాన కారణం మొబైల్ ఫోన్లే. థియేటర్లో కూర్చున్న కొందరు వ్యక్తులు రహస్యంగా తమ మొబైల్ కెమెరాతో సినిమా షూట్ చేసి, వెంటనే వెబ్‌సైట్లలో లేదా టెలిగ్రామ్ ఛానళ్లలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ దారుణ చర్య వల్ల సినిమా మేకర్స్‌కు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి.
కాబట్టి ఒకవేళ థియేటర్లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అనుమతించకపోతే, పైరసీని గణనీయంగా తగ్గించవచ్చని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే నిజంగా సినిమా ఇండస్ట్రీకి కొత్త ఊపిరి వచ్చినట్టే అవుతుంది. సినిమా థియేటర్లలోని అనుభవం ప్రేక్షకులకు మరింత పాజిటివ్‌గా మారుతుంది, అలాగే సినిమా మేకర్స్ చేసిన కష్టం వృథా కాకుండా ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది ప్రముఖులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుంది, థియేటర్లలో నిజంగా మొబైల్ బ్యాన్ సాధ్యమవుతుందా ..? అన్నది మాత్రం రాబోయే రోజుల్లో స్పష్టత కావాలి. కానీ ఒకవేళ ఈ ఆలోచన విజయవంతంగా అమలు చేస్తే, పైరసీ అనే ముప్పు నుండి ఇండస్ట్రీ కొంతవరకు విముక్తి పొందుతుందని సినీ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..!