
రష్మిక ,విజయ్ దేవరకొండ కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఇక అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే కొన్ని పోస్టులు కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలకు మరింత బలాన్నిచ్చాయి. ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా జరగడంతో అసలు విజయ్ దేవరకొండ ,రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందనే విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వినిపిస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే విజయ్ దేవరకొండ 1989 మే తొమ్మిదవ తేదీన జన్మించారు.. అంటే విజయ్ దేవరకొండ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. ఇక రష్మిక విషయానికి వస్తే 1996 ఏప్రిల్ 5న జన్మించింది రష్మిక. ఈమె వయసు ప్రస్తుతం 29 సంవత్సరాలు దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య ఏడు సంవత్సరాల వయసు తేడా ఉన్నట్లు కనిపిస్తోంది. రష్మిక గతంలో కూడా ప్రముఖ హీరోగా పేరు పొందిన రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు రెండవసారి మళ్లీ విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా పలు చిత్రాలలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ అనే చిత్రంలో నటించబోతున్నారు.