ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఈ రియాలిటీ షో మొదట ఇండియా లో హిందీ భాషలో ప్రారంభం అయింది.ఈ షో కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం మొదలు అయింది. దానితో ఈ షో ను ఆ తర్వాత భారత దేశంగా అనేక ప్రాంతీయ భాషలలో కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ షో ను కన్నడ భాషలో కూడా పెద్ద ఎత్తున మొదలు పెట్టారు. ఇప్పటివరకు కన్నడ లో బిగ్ బాస్ షో కు సంబంధించిన చాలా సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం కూడా బిగ్ బాస్ షో కన్నడలో కంటిన్యూ అవుతుంది. తాజాగా బిగ్ బాస్ కన్నడ షో కు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ఈ షో ను బిడాదిలోని అమ్యూజ్మెంట్ పార్క్ , బాలీవుడ్ స్టూడియోలో నిర్వహిస్తున్నారు. ఈ షో ను నిర్వహిస్తున్న ప్రదేశం నుండి దాదాపు రోజు 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తున్నట్లు పర్యావరణ శాఖకు ఫిర్యాదులు రావడంతో వెంటనే వారు తనిఖీలు చేయడం జరిగి వెంటనే షో జరుగుతున్న ప్రదేశానికి తాళాలు వేసినట్లు తెలుస్తోంది.

అలాగే అనేక సార్లు ఈ షో జరుగుతున్న ప్రదేశం కు సంబంధించి కంప్లైంట్స్ రావడం , అలాగే షో లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ వాడుతున్న వేస్టేజ్ ను కూడా రోడ్డుపై పారేయడం ఇలా అనేక విషయాలు జరుగుతుండడం వల్ల ఏకంగా ఈ షో కు జరుగుతున్న ప్రదేశానికి తాళాలు వేయడం మాత్రమే కాకుండా ఈ షో కు కరెంటును కూడా తీసేసినట్లు తెలుస్తుంది. మరి ఇలా ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ హౌస్ కు తాళాలు పడడంతో ఈ సీజన్ సజావుగా జరుగుతుందా లేదా అనే టెన్షన్ కన్నడ బిగ్ బాస్ అభిమానుల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: