
డైరెక్టర్ గా నాకు మంచి మార్కెట్ ఉన్నప్పుడు ఈ సినిమా చేయాలని అనుకున్నానని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఒక్కడు సినిమా తర్వాత సౌత్ లో ఏ దర్శకునికి ఆఫర్ చేయని స్థాయిలో నాకు రెమ్యునరేషన్ ను ఆఫర్ చేశారని ఆయన తెలిపారు. ఆ సమయంలోరుద్రమదేవి చేయాలనీ నిర్ణయం తీసుకుని పలువురు నిర్మాతలకు కథ చెప్పానని గుణశేఖర్ తెలిపారు. కథ విన్న నిర్మాతలు బాగుందని అన్నారని ఆయన కామెంట్లు చేశారు.
ఆ సినిమాను హీరో బ్యాక్ డ్రాప్ లో మార్చాలని నిర్మాతలు నన్ను కోరారని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో నేనే నిర్మాతగా మారి రుద్రమదేవి తీశానని ఆయన పేర్కొన్నారు మహేష్ తో ఒక్కడు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించానని సెట్స్ పైకి వెళ్లే సమయానికి కథ సరిగ్గా కుదరలేదని అనిపించిందని గుణశేఖర్ తెలిపారు.
రుద్రమదేవి మూవీ అనుకున్నపుడు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు పేర్లు వినిపించాయని వాళ్లకు ఆ పాత్ర గురించి బాగా తెలుసనీ వాళ్ళు కూడా ఆ పాత్ర చేయడానికి ఆసక్తి చూపించారని ఆయన చెప్పుకొచ్చారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదని గుణశేఖర్ కామెంట్లు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఆ పాత్రను పోషించారని ఆయన పేర్కొన్నారు. గుణశేఖర్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. గుణశేఖర్ కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.