తెలుగమ్మాయి రేఖా భోజ్ గురించి కొత్తగా, ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించిన రేఖాభోజ్ యూట్యూబ్ కవర్ సాంగ్స్ ద్వారా కూడా పాపులర్ అవుతున్నారు. యాక్టింగ్ ను మాత్రం వదలనని చెబుతున్న రేఖా భోజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం లవ్ ఇన్ వైజాగ్ అని షణ్ముఖ్ తో కలిసి యాక్ట్ చేశానని ఆమె అన్నారు. ఆ తర్వాత డర్టీ పిక్చర్ అనే షార్ట్ ఫిల్మ్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

కాలాయ తస్మై నమః సినిమాతో  సినిమాల్లో అడుగు పెట్టానని  నా లైఫ్ లో ఫస్ట్  కవర్ సాంగ్ సామి సామి అని ఆమె తెలిపారు.  బంగారు గాజులు అమ్మి మరీ ఆ సాంగ్ చేశానని ఆమె తెలిపారు  ఆ సాంగ్ వల్ల మాంగల్యం సినిమాలో ఆఫర్ వచ్చిందని  ఆ మూవీ నాకు మంచి పేరును తెచ్చిపెట్టిందని రేఖా  భోజ్ కామెంట్స్ చేశారు.  గత ఐదారేళ్లుగా మూవీ ఆఫర్లు వస్తున్నాయి కానీ కమిట్మెంట్ అడుగుతున్నారని అలాంటి వాళ్లకు గట్టి కౌంటర్లు ఇచ్చానని ఆమె తెలిపారు.  

బిగ్ బాస్ షోకు వెళ్ళడానికి గత నాలుగేళ్లుగా ట్రై చేస్తున్నానని  గతేడాది ఇంటర్వ్యూ కూడా పూర్తైన తర్వాత రిజెక్ట్  చేశారని ఆమె అన్నారు.  ముక్కూ మొహం తెలియని వాళ్ళు కూడా బిగ్ బాస్ షోకు వెళ్తున్నారని నాకెందుకు ఛాన్స్ రావడం లేదో అర్థం కావడం లేదని ఆమె కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షో సీజన్9 కు వీడియో పంపించానని  కానీ లక్ కలిసిరావడం లేదని ఆమె  వెల్లడించారు.

రేఖా భోజ్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఆమె ఫ్యాన్స్  ఫీలవుతున్నారు. రేఖా భోజ్ భవిష్యత్తు ప్రణాళికలు  ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: