కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం జన నాయగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులను ప్రముఖ ఆడియో సంస్థలలో ఒకటి అయినటువంటి టి సిరీస్ సంస్థ వారు అత్యంత భారీ దరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. తలపతి విజయ్ ఇప్పటికే ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపించిన విషయం మన అందరికి తెలిసిందే.

దానితో ఈయన జన నాయగన్ మూవీనే నా చివరి సినిమా అని ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటాను అని కేవలం రాజకీయాలపై దృష్టి పెడతాను అని కూడా ప్రకటించాడు. మరి విజయ్ జన నాయగన్ మూవీ తర్వాత సినిమాలకు దూరంగా ఉండి కేవలం రాజకీయాలపై దృష్టి పెడతాడ ... లేక ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు ఇలా రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళతాడా అనేది చూడాలి. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి మాత్రం జన నాయగన్ మూవీ పై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: