ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతున్న సమాచారం ప్రకారం — రష్మిక మందన్న తన తదుపరి సినిమాలకు కమిట్ అవ్వడానికి ఏకంగా ₹20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు! ఇప్పటివరకు ఆమె తీసుకుంటూ వచ్చిన పారితోషికం సుమారు ₹7–9 కోట్ల మధ్యే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా దానిని మూడు రెట్లు పెంచేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కొంతమంది అభిమానులు కూడా “ఇంత పెరగడం నిజమేనా?” అని షాక్ అవుతున్నారు.అయితే మరో కోణం కూడా ఉంది. రష్మిక అభిమానులు మరియు ఫిల్మ్ అనలిస్టులలో కొందరు మాత్రం “రష్మిక ఈ డిమాండ్‌కు పూర్తిగా అర్హురాలు” అని అంటున్నారు. ఒక సినిమాలో ఆమె ఎంత కష్టపడుతుందో, షూటింగ్ సమయంలో ఎంత డెడికేషన్ చూపుతుందో, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ఎంత విలువ తెస్తుందో చెప్పుకుంటూ, “ఆమె మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే ₹25 కోట్లు పెద్ద మొత్తం కాదు” అంటూ సమర్థిస్తున్నారు.
ఇదిలా ఉంటే… రష్మిక మందన్న వ్యక్తిగత జీవితం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ–రష్మిక పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయమై అనధికారికంగా రష్మిక కూడా కొన్ని సూచనలు ఇచ్చిందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటువంటి సెన్సిటివ్ మూమెంట్‌లో రష్మిక ఇంత భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం సరైనదేనా అని సినీ విశ్లేషకులు చర్చిస్తున్నారు.కొంతమంది అయితే ఇది ఇప్పటివరకు ఏ భారతీయ హీరోయిన్ కూడా తీసుకోని ఆల్‌టైమ్ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అవుతుందని, రష్మిక నిజంగా ఒక కొత్త రికార్డు సృష్టించబోతోందని అభిప్రాయపడుతున్నారు.మొత్తం మీద — రష్మిక మందన్న ఒక సింపుల్ హీరోయిన్‌గా మొదలైన ప్రయాణాన్ని ఇప్పుడు స్టార్ రేంజ్‌లోకి తీసుకెళ్లింది. కెరీర్ పీక్‌లో ఉన్న ఈ సమయంలో రెమ్యూనరేషన్ పెంచుకోవడం సహజమేనా? లేక మార్కెట్‌ను మించిన డిమాండ్ చేస్తున్నదా? అనే చర్చలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి