సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎంతలా ఉంటుందో తాజాగా ఓ నటి తన కు ఎదురైనా అనుభవాన్ని పంచుకుంది.కోలీవుడ్ టీవీ యాక్టర్ అయినటువంటి మాన్యా ఆనంద్ రీసెంట్గా ధనుష్ సినిమాలో అవకాశం కోసం ఆయన మేనేజర్ నన్ను కమిట్మెంట్ అడిగాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాన్యా ఆనంద్ మాట్లాడుతూ.. ధనుష్ మేనేజర్ శ్రేయస్ ధనుష్ సినిమాలో ఆఫర్ ఇస్తానని చెప్పి తనని కమిట్మెంట్ ఇవ్వమన్నాడని, ఆఫరిస్తే కమిట్మెంట్ ఇవ్వాలా అని అడిగితే .ధనుష్ కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా అంటూ దారుణంగా మాట్లాడడంతో నేను అరిచేసరికి అతను నాకు ధనుష్ అడ్రస్ షేర్ చేసి వెళ్లిపోయాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు సినిమాల్లో ఆఫర్ ఇస్తే కమిట్మెంట్ ఇవ్వాలా... మేము సినిమాల్లో నటించడానికి మాత్రమే ఉన్నాం.. మీ పర్సనల్ పనులు చేయడానికి కాదు.. 

సినిమాల్లో ఆఫర్ ఇస్తే పడక సుఖం తీర్చడానికి మేం లేము.. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టకండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మాన్యా ఆనంద్. ఇక మాన్య ఆనంద్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో తుదుమారం సృష్టించాయి. దీంతో చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియాలో ధనుష్ మేనేజర్ ఇంత చేస్తుంటే ఆయన ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారేంటి ఇన్ని రోజులుగా హీరోయిన్లకు అవకాశాలు ఇస్తామని చెప్పి ఇలాగే వాడుకుంటున్నారా.. ఎందుకు ధనుష్ దీని గురించి స్పందించడం లేదు అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. దీంతో తాజాగా స్పందించి అసలు విషయం బయట పెట్టారు ధనుష్ టీం.. ధనుష్ నిర్మించే సినిమాలో నటించడం కోసం శ్రేయస్ అనే వ్యక్తి కాల్ చేసి ధనుష్ కోసం అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పాడని స్క్రిప్ట్ తో పాటు ప్రొడక్షన్ హౌస్ లోకేషన్ పంపించగా.. నేను ఆ నెంబర్ ని బ్లాక్ చేశానని హీరోయిన్ మాన్యా ఆనంద్ తెలిపింది.

అయితే దీనిపై తాజాగా ధనుష్ టీం స్పందిస్తూ.. ధనుష్ మేనేజర్ అని చెప్పి ఎవరో అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అది ధనుష్ మేనేజర్ శ్రేయస్ కాదని, అవకాశాల పేరుతో ధనుష్ మేనేజర్ అని చెప్పి అమ్మాయిలని బ్లాక్ మెయిల్ చేస్తూ పేరు చెడగొడుతున్నాడని, ఇప్పటికే మేం పోలీసులకు ఫిర్యాదు చేసాం అంటూ స్పందించారు.అలా ధనుష్ మేనేజర్ శ్రేయస్ మాన్యా ఆనంద్ కి ఫోన్ చేయలేదని, ఆయన పేరిట వేరే వాళ్ళు ఫేక్ కాల్ చేసి అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. మరి దీనిపై మాన్యా ఆనంద్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: