వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే దర్శకుడు బాబీ  కూడా తాజాగా అనూహ్యంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. సాధారణంగా ఏ పబ్లిక్ ఈవెంట్‌లోనైనా మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండే బాబీ, ఈసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం అతిగా చెప్పేయడంతో నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.కార్తీక మాసం సందర్భంగా కాపు సామాజికవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజనాలకు బాబీ ఇటీవల ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
 

బాబీ మాట్లాడుతూ..“మీ అందరినీ చూస్తుంటే జనసేన బలం కనిపిస్తోంది. కళ్యాణ్‌ గారిలోని ఆవేశం, చిరంజీవి గారిలోని ఓపిక మీలో స్పష్టంగా కనిపిస్తుంది. మాది గుంటూరు జిల్లాలో ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం. చిన్నప్పటి నుంచే మా నాన్నగారు ‘జీవితంలో ఎదగాలంటే చిరంజీవి గారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకో’ అని చెప్పేవారు. అదే అభిమానంతో, ఎవరి సపోర్ట్ లేకుండా హైదరాబాద్‌కి వచ్చి క్రమశిక్షణతో ఉన్నాను. అందుకే ఈ స్థాయికి చేరుకున్నాను.మన కమ్యూనిటీ గురించి సాధారణంగా ఆవేశపరులు అని అంటారు. కానీ మనకు ఉన్న ఓపిక, పట్టుదల, లక్ష్యం చేరుకునే తపన కూడా అంతే గొప్పది. పవన్ కళ్యాణ్ గారు అందుకు పెద్ద ఉదాహరణ. ప్రజాసేవ చేయాలనే కోరికతో ఏసీ రూములు పక్కన పెట్టి,  స్టార్‌డమ్ వదిలేసుకుని నీయమ్మ ఉన్నాంరా అంటూ వందల కోట్లు వదిలేసుకుని ఎన్నో మాటలు పడుతున్నారు పవన్ కల్యాణ్.

 

అయితే ఆయన మాటలను నెటిజన్లను ఒక్కసారిగా ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో సోషల్ మీడియాలో బాబీపై కౌంటర్లు వెల్లువెత్తాయి.“బాబీ, నువ్వు మాట్లాడుతున్నది నీకైనా అర్థం అవుతుందా?”, “కాపు వనభోజనాలకు వెళ్లి రెండు ముద్దలు తినిరాక  చిరంజీవి–పవన్ కళ్యాణ్ గురించి అంత ఎలివేషన్లు ఎందుకు?”,  అంటూ చాలామంది కౌంటర్ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఇంకా ఘాటుగా స్పందిస్తూ,“నువ్వు సినిమాలు బాగా తీస్తే చూసి హిట్ చేస్తాం. మైక్ దొరికిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు. నీ ఈ మాటలు వింటే పవన్ కళ్యాణ్‌ కూడా నిన్నే తిడతారు” అని వ్యాఖ్యానిస్తున్నారు. బాబీ చెప్పిన వ్యాఖ్యలు ఎంత నిజం, ఎంత అతిశయం అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తున్నప్పటికీ, ఒక చిన్న ఫంక్షన్ లో చెప్పిన మాటలు ఇలా వైరల్ కావడం మాత్రం బాబీ ఊహించని విషయం అనుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: