కోలీవుడ్ హీరో ధనుష్ ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు తీసుకున్నప్పటి నుండి ఆయన రెండో పెళ్లి వార్తలు కోలీవుడ్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే కొద్ది రోజులుగా ఎంతో మంది హీరోయిన్లతో ధనుష్ రెండో పెళ్లి అంటూ ముడిపెట్టారు. అయితే రీసెంట్ గా మాత్రం ఓ హీరోయిన్ తో ధనుష్ పేరు తెగ మార్మోగిపోతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో స్టార్డం సంపాదించిన మృణాల్ ఠాకూర్ గత కొద్ది రోజులుగా ధనుష్ తో క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలా ఆ మధ్యకాలంలో మృణాల్ ఠాకూర్ నటించిన సినిమా ఈవెంట్ కి ధనుష్ గెస్ట్ గా వెళ్లారు. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్ బర్త్ డే కి కూడా ధనుష్ హాజరవ్వడంతో వీరిద్దరి మధ్య ఏదో ప్రత్యేక బాండింగ్ ఉంది. 

అందుకే ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించని వీరిద్దరూ తరచూ క్లోజ్ గా ఉంటున్నారు అనే రూమర్లు వినిపించాయి. అయితే ఆ రూమర్లకు ఆజ్యం పోసేలా గత కొద్ది రోజులుగా ఎన్నో జరుగుతున్నాయి.ధనుష్ పెట్టిన పోస్టులకు మృణాల్ లైక్ చేయడం.. మృణాల్ ఠాకూర్ పెట్టిన పోస్టులకు ధనుష్ లైక్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనే ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా మృణాల్  నటించన దో దీవానే షెహర్ మే అనే మూవీ టీజర్ విడుదల అవ్వగా ఈ టీజర్ ని మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇక ఈ పోస్ట్ చూసిన ధనుష్ చాలా బాగుంది అని రిప్లై ఇవ్వడమే కాకుండా మరోసారి రూమర్లకు ఆజ్యం పోశారు.ఇక ధనుష్ రిప్లై కి మృణాల్ ఠాకూర్ లవ్ సింబల్ తో రిప్లై ఇచ్చేసరికి డౌటే లేదు వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉంది. కచ్చితంగా డేటింగ్ చేస్తున్నారు. అందరూ అనుకుందే జరగబోతోంది. త్వరలోనే ధనుష్ మృణాల్ ఠాకూర్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే మృణాల్ తో ధనుష్ డేటింగ్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: