ఈ విమర్శలు ఊపందుకున్న వెంటనే శివజ్యోతి స్పందిస్తూ, తాను కావాలనే ఎవరినీ నొప్పించే ఉద్దేశ్యం లేకుండా మాట్లాడానని, ఎవరైనా తన మాటల వల్ల బాధపడ్డారు అంటే హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నానని ఒక ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది. ఇందులో తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సందర్భాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వివాదం అయ్యాయని కూడా వివరించింది. అయితే, శివజ్యోతి విడుదల చేసిన క్షమాపణ వీడియో తర్వాత వివాదం మరింత ముదిరింది. ప్రముఖ కమెడియన్ కిరాక్ ఆర్పీ, ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. “నువ్వు నిజంగానే అడుక్కునే దానివే. అడుగుతూ అడుగుతూ వచ్చిన అవకాశాల వల్లే ఈ స్థాయికి ఎదిగావు. దేవుడి గురించి మాట్లాడే స్థాయి నీకు వచ్చిందా?” అంటూ ఆయన శివజ్యోతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతని ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు సమర్థిస్తుండగా, మరికొందరు ఆయన మాట తీరు అవసరానికి మించి దూకుడుగా ఉందని విమర్శిస్తున్నారు. “ఎక్కడ ఏ చిన్న వివాదం జరిగినా ఈ వ్యక్తి ముందుకు వచ్చి ఎవరి మీదో రెచ్చిపోతాడు”, “శివజ్యోతి తప్పు చేసినా ఇంత అవమానంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు” అంటూ చాలా మంది కిరాక్ ఆర్పీపై మండిపడుతున్నారు. మొత్తం గా, ఈ ఘటన శివజ్యోతి—కిరాక్ ఆర్పీ మధ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఒక వర్గం శివజ్యోతి తప్పు చేశారని భావిస్తుండగా, మరొక వర్గం ఆమెపై జరుగుతున్న అనవసర వ్యక్తిగత దాడులను తప్పుబడుతోంది. ఈ వివాదం ఇంకా కొన్ని రోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి