బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే అభిమానులకు పూనకాలే. ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన అఖండ 2 చిత్రం కూడా భారీ అంచనాల మధ్య విడుదలై ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా రాబట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా అఖండ సిరీస్ అయిదారు వస్తాయని కూడా తెలియజేశారు. అలాగే అఖండ 2 చివరిలో పార్ట్ 3 ఉంటుందంటూ లీడ్ ఇచ్చారు. అయితే ఈ విషయం పైన క్లారిటీ రాలేదు.


అఖండ 2 సినిమా సక్సెస్ తర్వాత మీడియాతో బోయపాటి మాట్లాడుతూ.. అవెంజర్స్ స్థాయిలో స్కోప్ ఉన్న చిత్రమే అఖండ.. అయితే అవెంజర్స్ అనేవి రచయితలు పుట్టించిన సూపర్ హీరో కథలు, కానీ మన దగ్గర అలాంటి హీరోలు పురాణాలలో చాలామంది ఉన్నారు. మన చరిత్ర నుంచి ఎన్నో కథలు ఎంతోమంది సూపర్ హీరోలను మనం బయటికి తీయవచ్చు. అలాంటివి రావాలి అంటే మనకు సంకల్పం, ఓపిక ఉండాలి.. ప్రేక్షకులు కూడా చూస్తున్నారు కదా! అని వెంట వెంటనే సీక్వెల్స్ తీయడం కూడా సరైనది కాదు అంటూ తెలిపారు.



రెండు మూడు సినిమాలు గ్యాప్ తీసుకొని మళ్లీ అఖండ 3 సినిమా గురించి ఆలోచిస్తాను.. అఖండ 2 సినిమా క్లైమాక్స్ లో శంబాల తలుపులు తెరుచుకోవడాన్ని చూపించాము అక్కడినుంచి అఖండ 3 మొదలవుతుందంటూ తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తే అఖండ 3 సినిమా కూడా ఉంటుందని, అయితే అది ఇప్పట్లో ఉండదని కనీసం ఇతర హీరోలతో రెండు మూడు చిత్రాలు చేసిన తర్వాతే ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా పనికి అఖండ 3 ఉంటుందని విషయంపై బోయపాటినే క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తదుపరిచిత్రాన్ని 2026 ఏప్రిల్ నెల నుంచి మొదలు పెట్టబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: