ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఆడవాళ్ళ మీద మీ అహంకారం మాటలు ఏంటి అంటూ ప్రశ్నించారు? ఆడవాళ్ళ మీద శివాజీ మాట్లాడింది 100% చెత్త మాటలే అంటూ తెలియజేశారు. ఇది మీ ఆలోచనలో భాగం, సంస్కారులు అనుకునేవారు ఇలాంటి వేదికల మీద మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. క్షమాపణ అడిగినా కూడా వదలడం లేదు కదా ! తన మద్దతు మాత్రం అనసూయకే ఉంటుందని అమ్మలు, చెల్లెళ్ల గురించి మాట్లాడేవారి బుర్రలు అంతవరకే పని చేస్తాయంటూ విమర్శలు చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళలను కుసంస్కారంతో చూసే వాళ్లకు మాత్రమే ఆడవాళ్ళ అవయవాలు కనిపిస్తాయి అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు.
మహిళలపై చేసిన వ్యాఖ్యలకు నోటీసులు కూడా అందుకున్న శివాజీ తాజాగా మహిళా కమిషనర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అక్కడ మహిళా కమిషనర్ పలు ప్రశ్నలతో నటుడు శివాజీని ఉక్కిరిబిక్కిరి చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు గాను మహిళలోకానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు శివాజీ. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలలో నటిస్తే బాగా పేరు సంపాదిస్తున్న సమయంలో శివాజీ చేసిన వ్యాఖ్యల వల్ల సినీ కెరీర్ ని రిస్క్ లో పడేలా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి