తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తాజాగా జన నాయగన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో విజయ్ కి జోడిగా నటించింది. మమత బైజు ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి చాలా ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాలను లభించింది.

ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ పెద్ద ఎత్తున ఈ సినిమాకి సంబందించిన ప్రచారాలను నిర్వహిస్తూ వస్తుంది. ఈ మూవీ పై తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ కొంత కాలం క్రితం ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. దానితో విజయ్ కొంత కాలం క్రితం జన నాయగన్ నా చివరి సినిమా అని , ఆ సినిమా తర్వాత సినిమాలు చేసే ఉద్దేశం లేదు అని , పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెడతాను అని చెప్పుకొచ్చాడు.

దానితో విజయ్ ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలి అని ఆయన అభిమానులు ఎంతో ఆశ పడుతున్నారు. మరి విజయ్ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందువల్ల ఈ మూవీ కి మంచి ఓపెనింగ్లు లభించే అవకాశం ఉంది. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: