తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ప్రేమ కావాలి అనే మూవీ తో నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన లవ్ లీ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా కెరియర్ను ప్రారంభించిన మొదటి రెండు సినిమాలతోనే మంచి విజయాలను అందుకున్న ఈయన ఆ తర్వాత మాత్రం వరుస పెట్టి అనేక భారీ అపజయాలను సొంతం చేసుకున్నాడు. ఇలా అనేక సంవత్సరాల పాటు అపజయాలతో కెరియర్ను ముందుకు సాగించిన ఈయన తాజాగా శంభాల అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల్లో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. 13 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్లు దక్కాయి. ఈ మూవీ దాదాపు 5 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంది. అలాగే ఇప్పటికే ఈ సినిమా ఏకంగా నాలుగు కోట్ల లాభాలను కూడా అందుకుంది. చాలా కాలం పాటు అనేక సినిమాలతో అపజయాలను అందుకున్న ఆది సాయి కుమార్ "శంబాల" మూవీ తో మాత్రం సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. దానితో ఈ సినిమా మరికొన్ని రోజుల పాటు మంచి కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: