దీంతో చాలామంది డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గురించి తెలుసుకోవాలని తెగ వెతికేస్తున్నారు. గీతూ మోహన్ దాస్ అసలు పేరు గాయత్రి. వీరిది మలయాళ కుటుంబం. మొదట బాలనటిగా" ఒన్ను ముట్టల్ పూజ్యం వరే" చిత్రంలో నటించింది. ఇందులో మోహన్ లాల్ కు వాయిస్ ఓవర్ అందించడమే కాకుండా అతిథి పాత్రలో కనిపించడంతో భారీగానే క్రేజీ సంపాదించింది. ఈ సినిమాలో నటించిన సమయంలో ఇమే వయసు కేవలం 4 సంవత్సరాలు. అలా ఎన్నో చిత్రాలలో నటించిన గీతూ AKALE అనే చిత్రంలో ఈమె నటనకు కేరళ స్టేట్ అవార్డు కూడా లభించింది.
గీతూ మోహన్ దాస్ ఎన్నో రకాల షార్ట్ ఫిల్మ్ తీసినప్పటికీ ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలిగా హిందీ సినిమా అయిన లయర్స్ డైస్ చిత్రంతో మొదలయ్యింది.. ఈ చిత్రానికి గాన ఉత్తమ నటిగా గీతాంజలి థాపా, రాజీవ్ రవి చాయాగ్రహకుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మరో చిత్రం మూథోన్ చేశారు. చాయ గ్రహకుడుగా నేషనల్ అవార్డు అందుకున్న రాజీవ్ రవి ఎవరో కాదు గీతు మోహన్ దాస్ భర్త. వీరికి 2009 , నవంబర్ 14న వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉన్నది. వివాహం అనంతరం యాక్టింగ్ కు దూరమైన గీతూ మోహన్ దాస్ మళ్లీ ఐదేళ్ల కు దర్శకురాలిగా మారారు. ఆ సినిమానే టాక్సిక్. ఈ చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీగా గీతూ భర్తే అందిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి