టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోల క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ఒక్కో సినిమాకు వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది, ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలను వెండితెరపై దైవ సమానులుగా ఆరాధిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దీనికి కారణం హీరోల నటనో లేక వారి కష్టమో కాదు, కేవలం దర్శకుల వైఫల్యమేనని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. "బంగారం లాంటి హీరోలను చేతికి ఇస్తే.. కనీస అవగాహన లేకుండా ప్లాపులు ఇస్తున్నారు" అంటూ దర్శకులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా అంటే అభిమానులు కేవలం యాక్షన్ మాత్రమే ఆశించరు. ఆ హీరో ఇమేజ్‌కు తగ్గ కథ, పవర్‌ఫుల్ ఎలివేషన్లు, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే ఉండాలని కోరుకుంటారు. కానీ ఇటీవల వస్తున్న చాలా సినిమాల్లో దర్శకులు కేవలం టెక్నికల్ వాల్యూస్ మీద, గ్రాఫిక్స్ మీద పెడుతున్న శ్రద్ధ కథనం మీద పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హీరోలు తమ ప్రాణాలను పణంగా పెట్టి రిస్కీ స్టంట్స్ చేస్తున్నా, మేకోవర్ కోసం నెలల తరబడి కష్టపడుతున్నా.. దర్శకులు రాసుకునే బలహీనమైన కథల వల్ల ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. ముఖ్యంగా సీనియర్ డైరెక్టర్లు పాత చింతకాయ పచ్చడి లాంటి కథలతో వస్తుంటే, యంగ్ డైరెక్టర్లు లాజిక్ లేని స్క్రిప్టులతో హీరోల కెరీర్‌ను రిస్క్‌లో పడేస్తున్నారని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు దర్శకుడి విజన్ నమ్మి హీరోలు సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా దర్శకులు అప్డేట్ అవ్వలేకపోతున్నారనేది వాస్తవం. భారీ బడ్జెట్ ఉంది కదా అని అనవసరపు హంగులకు పోయి అసలు కథను గాలికి వదిలేస్తున్నారు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడు హీరో కటౌట్ చూసి మురిసిపోయినా, కథలో దమ్ము లేకపోతే నిర్మొహమాటంగా సినిమాను తిరస్కరిస్తున్నాడు. "మా హీరో తన వంద శాతం కష్టాన్ని ఇస్తున్నాడు, కానీ దర్శకులే సరైన అవుట్‌పుట్ ఇవ్వలేకపోతున్నారు" అన్నది సగటు అభిమాని వెలిబుచ్చుతున్న అసహనం. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో డైరెక్టర్ల పేర్లను ట్యాగ్ చేస్తూ ట్రోలింగ్ చేయడం, వారి పాత సినిమాలతో పోలుస్తూ విమర్శించడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటికైనా దర్శకులు కేవలం హీరోల ఇమేజ్ మీద ఆధారపడకుండా, పక్కా స్క్రిప్టులతో వస్తేనే ఈ "బంగారం లాంటి హీరోల" కెరీర్ సేఫ్ జోన్‌లో ఉంటుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి