దీనితో కొన్ని సీన్స్ ని తీసేయడంతో డైరెక్టర్ మారుతి పైన తీవ్రస్థాయిలోనే విమర్శలు చేశారు. నిన్నటి రోజున సక్సెస్ మీట్ పెట్టి మరి డైరెక్టర్ మారుతి కట్ చేసిన సీన్స్, ప్రభాస్ ముసలి గెటప్ సీన్స్ కొన్ని థియేటర్లలో జత చేసి విడుదల చేస్తామని తెలియజేశారు. ఈరోజు ఉదయం నుంచే ఈ సీన్స్ ని జత చేశారు. ఇందుకు సంబంధించి ఒక ప్రోమో ను విడుదల చేశారు. అప్ సైడ్ డౌన్ ప్రోమో అంటూ ప్రభాస్ ముసలి గెటప్ లో చేసే ఫైట్ సీన్ కి సంబంధించి ఒక ప్రోమో ని విడుదల చేశారు.
అయితే ఈ ప్రయోగంలో ప్రభాస్ గాలిలో ఎగిరే ఫైట్ సీన్ యాడ్ చేయడంతో ఇంత మంచి ఫైట్ సీన్ ని ఎందుకు యాడ్ చేయలేదు అంటూ అభిమానులు సైతం విమర్శిస్తున్నారు. ఇలాంటి సీన్స్ ముందే యాడ్ చేసి ఉంటే టాప్ మరొక లాగా ఉండేదేమో అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రాజా సాబ్ సినిమా లో ఏం జత చేసారో చూడడానికి అభిమానులు మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కొత్త ప్రోమో అయితే వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి