టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ కు, డైరెక్టర్లకు సంక్రాంతి సెంటిమెంట్ బాగానే వర్క్ అవుట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అలా ఇప్పుడు సంక్రాంతికి వచ్చి మళ్లీ విజయాలను అందుకోవాలని అందుకోవాలని చూస్తున్నారు.హీరో రవితేజ కమర్షియల్ హీరోగా మారకముందు సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలా సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు రవితేజ. అయితే రాను రాను ఇదే ఒక సెంటిమెంట్ గా మారింది. చిరంజీవి అన్నయ్య సినిమా నుంచి ఈ సెంటిమెంట్ మొదలైనట్లు తెలుస్తోంది.


అలా 2003 మినహా మిగిలిన సంక్రాంతి కి వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అలా 2008 కృష్ణ సినిమా వరకు మంచి విజయాలను అందుకున్నారు. 2010లో శంభో శివ శంభో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. 2011లో మిరపకాయ సినిమా మరొకసారి రవితేజ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. అలాగే 2021లో సంక్రాంతి బరిలో దిగిన క్రాక్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోగా, వాల్తేర్ వీరయ్య సినిమాలో చిరంజీవికి సోదరుడిగా నటించి 2023లో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో సక్సెస్ అందుకోవడానికి చాలా గట్టిగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.


ముఖ్యంగా రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి నటిస్తున్నారు. ధమాకా సినిమా తర్వాత సరైన సక్సెస్ అందుకోలేని రవితేజ.ఈసారి సంక్రాంతికి హిట్ కొట్టాలని చూస్తున్నారు. రిస్క్ ఉన్నప్పటికీ సినిమా మీద నమ్మకంతో బరిలోకి దిగుతున్నారు.అలాగే మరొక హీరో శర్వానంద్ 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా తో మంచి విజయాన్ని అందుకోగా ఆ తర్వాత 2017 లో శతమానం భవతి సినిమాతో మరో హిట్ అందుకున్నారు. దీంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ తో నారి నారి నడుమమురారి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో సంయుక్త మీనన్ , సాక్షి వైద్య నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రాబోతోంది. ఈ సినిమా కూడా శర్వానంద్ కు చాలా కీలకమని చెప్పవచ్చు.


2024 లో గుంటూరుకారం సినిమాలో నటించిన మీనాక్షి చౌదరి 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాలను అందుకుంది. ఇప్పుడు 2026 లో కూడా అనగనగా ఒక రాజు సినిమాతో విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి వీరందరికీ సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వస్తుందా లేదా అనే విషయం  తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: