అయితే ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఒకే ఒక మాట చెబుతున్నారు. అదేంటంటే – ఇలాంటి డేరింగ్ డెసిషన్‌ను మారుతి గారు తీసుకుని ఉంటే, రాజా సాబ్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యేది అన్న అభిప్రాయం. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.మనందరికీ తెలిసిందే, రాజా సాబ్ సినిమా జనవరి 9న భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా అభిమానుల నుంచి కూడా మిశ్రమ స్పందన రావడంతో, సినిమా ఆశించినంత రీచ్‌ను సాధించలేకపోయింది. చాలా మంది “సినిమాలో అసలు కథలో కొత్తదనం లేదు, ఏమీ ప్రత్యేకంగా అనిపించలేదు” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక్కడే అనిల్ రావిపూడి మరియు మారుతి దర్శకత్వ శైలుల మధ్య పోలికలు మొదలయ్యాయి. మన శంకర్ వరప్రసాద్ సినిమా కథ చాలా రొటీన్ అయినప్పటికీ, అనిల్ రావిపూడి దాన్ని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మోడ్‌లో ప్రెజెంట్ చేశారు. ప్రతి సీన్‌లో నవ్వు, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ సమతుల్యంగా ఉండేలా స్క్రీన్‌ప్లేను రూపొందించారు. సాధారణ కథను కూడా ఎలా ఆసక్తికరంగా మలచవచ్చో ఈ సినిమాతో మరోసారి నిరూపించారు.అదేవిధంగా, మారుతి కూడా ప్రభాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, కథను పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కోణంలో తీసుకుని ఉంటే, రాజా సాబ్ సినిమా ఫలితం వేరేలా ఉండేదని ఇప్పుడు చాలా మంది అంటున్నారు. ప్రభాస్ అభిమానులు కూడా “స్టార్ ఇమేజ్ కంటే మంచి వినోదం ఇచ్చే కథ, సీన్స్ ఉంటే సినిమా తప్పకుండా హిట్ అయ్యేది” అని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే రాజా సాబ్ సినిమాకు నెగిటివ్ టాక్ బలంగా వ్యాప్తి చెందింది. దాంతో కొందరు నెటిజన్లు మారుతి గారిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మారుతి గారు కూడా స్పందిస్తూ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో అయినా నెక్స్ట్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, హీరోల కెరీర్‌ను దెబ్బతీయకుండా మంచి కథలను ఎంచుకోవాలని జనాలు మట్లాడుకుంటున్నారు. మొత్తానికి, ఈ సమయంలో మన శంకర్ వరప్రసాద్ సినిమాను రాజా సాబ్ తో పోల్చుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. చిరంజీవి నటన, అనిల్ రావిపూడి దర్శకత్వం, నయనతార ఆకర్షణ – ఈ మూడు కలిసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. అదే సమయంలో, సరైన ట్రీట్మెంట్, స్క్రీన్‌ప్లే, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ లేకపోతే, ఎంత పెద్ద హీరో ఉన్నా సినిమా ఫలితం మారిపోతుందన్న విషయాన్ని రాజా సాబ్ ఉదాహరణగా నిలిచిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికైతే సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలపై జరుగుతున్న ఈ పోలికల చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో దర్శకులు కథల ఎంపికలో, వాటిని ప్రేక్షకులకు ఎలా చూపించాలన్న దానిలో మరింత జాగ్రత్త తీసుకుంటారని ఆశిద్దాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి