సినిమా అంటేనే మెగాస్టార్.. మెగాస్టార్ అంటేనే రికార్డులు. ఈ సినిమా కోసం చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం కోసం బాస్ సుమారు ₹70 కోట్ల నుండి ₹75 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకున్నారట. కేవలం పారితోషికమే కాకుండా, సినిమా లాభాల్లో కూడా ఆయనకు వాటా ఉన్నట్లు సమాచారం. తన కూతురు సుస్మిత కొణిదెల (గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్) నిర్మాతగా ఉండటంతో, ఈ సినిమాను చిరంజీవి తన సొంత సినిమాగా భావించి ప్రాణం పెట్టి నటించారు.
ఈ సినిమాలో మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అంటే అది విక్టరీ వెంకటేష్. దాదాపు 30 నిమిషాల పాటు సాగే ఆయన కీలక పాత్ర సినిమాకే హైలైట్ అని రివ్యూలు వస్తున్నాయి. చిరు - వెంకీ స్క్రీన్ షేర్ చేసుకోవడం చూసి ఆడియన్స్ థియేటర్లలో సీట్లలో కూర్చోలేకపోతున్నారు. ఈ 30 నిమిషాల పాత్ర కోసం వెంకటేష్ సుమారు ₹15 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు టాక్. కొందరు అయితే ఇది ₹22 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేవలం గెస్ట్ రోల్ స్థాయి దాటి, కథను మలుపు తిప్పే పాత్ర కావడంతో నిర్మాతలు కూడా వెనకాడకుండా అంత పెద్ద మొత్తం ఇచ్చారట.
దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా నయనతార పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమాలో 'శశిరేఖ' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించిన నయన్, తన మార్క్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆమె దాదాపు ₹10 నుండి ₹12 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.
200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాతలు సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. కేవలం నటీనటుల పారితోషికాలకే దాదాపు ₹110 కోట్లకు పైగా ఖర్చు చేశారట. కమర్షియల్ సక్సెస్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా భారీగానే ముట్టినట్లు తెలుస్తోంది. తన చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిన భీమ్స్‌కు సైతం అదిరిపోయే రెమ్యూనరేషన్ దక్కింది.
మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, అమెరికాలో $1 మిలియన్ మార్కును ప్రీమియర్ షోల ద్వారానే దాటేసింది. చిరంజీవి కెరీర్‌లో 'సైరా' తర్వాత ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం ఇదే మొదటిసారి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫుల్ రన్ లో ఈ సినిమా అన్ని పాత రికార్డులను తుడిచిపెట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.మొత్తానికి 'మన శంకర వర ప్రసాద్ గారు' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. బాక్సాఫీస్ వద్ద ఒక బలమైన బ్రాండ్ అని నిరూపితమైంది. పారితోషికాల విషయంలో స్టార్ల హవా కొనసాగితే, కలెక్షన్ల విషయంలో మెగాస్టార్ తన సత్తా ఏంటో మరోసారి చూపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి