దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, యూరప్‌లో రామ్ చరణ్‌పై ఒక భారీ సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారట. ఇప్పటికే రెహమాన్ మ్యూజిక్ అందించిన 'చికిరి చికిరి' పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పుడు యూరప్ షెడ్యూల్‌లో చరణ్-జాన్వీ కపూర్ మధ్య ఒక రొమాంటిక్ అండ్ మాస్ సాంగ్‌ను షూట్ చేయబోతున్నట్లు టాక్. ఈ సాంగ్‌లో చరణ్ స్టెప్పులు థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంటాయని ఇన్సైడ్ వర్గాల సమాచారం. కేవలం పాట మాత్రమే కాదు, అక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేయబోతున్నారట.
ఇటీవలే ఢిల్లీలో పార్లమెంట్ మరియు ఇండియా గేట్ పరిసరాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. అక్కడ చరణ్ రగ్గడ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కెమెరామెన్ రత్నవేలు ఈ సినిమాకి అందిస్తున్న విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, ఒక్కో ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ షెడ్యూల్ ముగించుకుని, టీమ్ అంతా యూరప్ విమానం ఎక్కడానికి సిద్ధమవుతోంది.
'పెద్ది' సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఇందులో బలమైన ఎమోషన్ కూడా ఉందని తెలుస్తోంది. క్లైమాక్స్ లో వచ్చే ఒక భారీ ప్రమాదం కారణంగా హీరో తన కాళ్ళు కోల్పోతాడట. అయినా సరే, అసాధారణమైన పట్టుదలతో రన్నింగ్ రేసులో పాల్గొని ఛాంపియన్ గా నిలబడతాడనేది ఈ సినిమా మెయిన్ పాయింట్ అని వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు రాసిన ఈ స్క్రిప్ట్ చరణ్ కెరీర్‌లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్.ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు, 'మిర్జాపూర్' ఫేమ్ దివ్యేంద్రు శర్మ, మరియు బోమన్ ఇరానీ వంటి దిగ్గజాలు నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. ఇప్పటికే వచ్చిన సాంగ్ కి వందల మిలియన్ల వ్యూస్ రావడం చూస్తుంటే, ఆడియో పరంగా సినిమా ఒక ప్రభంజనం సృష్టించడం ఖాయం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. శ్రీరామనవమి పండగ వేళ, 'పెద్ది' సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వనుంది.మొత్తానికి బుచ్చిబాబు 'పెద్ది' సినిమాతో చరణ్‌ను ఒక కొత్త కోణంలో చూపించబోతున్నారు. యూరప్ షెడ్యూల్ నుండి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి