రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ దాదాపు సంక్రాంతి సీజన్‌లోనే వచ్చాయి.
కృష్ణ (2008): వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, రవితేజ మార్కెట్‌ను పెంచింది.
మిరపకాయ్ (2011): హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే 'మాస్ మహారాజా' ట్యాగ్ మరింత స్ట్రాంగ్ అయ్యింది.
క్రాక్ (2021): కరోనా తర్వాత థియేటర్లకు కళ తెచ్చిన సినిమా ఇది. సంక్రాంతికి విడుదలై రవితేజకు బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ ఇచ్చింది.
వాల్తేరు వీరయ్య (2023): మెగాస్టార్‌తో కలిసి చేసిన ఈ మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఊచకోత కోసింది.ఈ చరిత్రను చూస్తుంటే, పండుగ పూట రవితేజ ఇచ్చే వినోదానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని అర్థమవుతోంది.
సాధారణంగా రవితేజ సినిమాలు అంటే యాక్షన్, భారీ ఫైట్లు ఉంటాయి. కానీ ఈ సినిమా కోసం ఆయన తన 'మాస్ మహారాజా' ట్యాగ్‌ను పక్కన పెట్టి, కేవలం నటనతో మెప్పించడానికి సిద్ధమయ్యారు. ఇద్దరు భామల (ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి) మధ్య నలిగిపోయే భర్తగా 'రామ సత్యనారాయణ' పాత్రలో రవితేజ పండించే కామెడీ సినిమాకు ప్రాణం అని తెలుస్తోంది. వివాహేతర సంబంధం చుట్టూ తిరిగే కథను కిషోర్ తిరుమల తనదైన క్లాస్ మరియు ఫన్ ట్రీట్‌మెంట్‌తో ఆసక్తికరంగా మలిచారు.
కేవలం 2 గంటల 10 నిమిషాల నిడివితో వస్తున్న ఈ సినిమా, ప్రస్తుత ట్రెండ్‌లో పెద్ద ప్లస్ పాయింట్. ఎక్కడా బోర్ కొట్టకుండా క్రిస్ప్‌గా ఉంటుందని సమాచారం.సంక్రాంతి సినిమాలంటే రేట్లు పెంచడం సహజం. కానీ ఈ సినిమాకు నార్మల్ టికెట్ రేట్లు మాత్రమే ఉంచడం ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే గొప్ప ఎత్తుగడ.ఈ మధ్య కాలంలో భీమ్స్ సిసిరోలియో ఇచ్చే మ్యూజిక్ మరియు బీజీఎం సినిమాలకు పెద్ద అసెట్ అవుతున్నాయి.
వరుస పరాజయాల తర్వాత రవితేజకు ఒక గట్టి హిట్ అవసరం. సంక్రాంతి సెంటిమెంట్, కిషోర్ తిరుమల కామెడీ టైమింగ్, మరియు రవితేజ ఎనర్జీ కలిస్తే బాక్సాఫీస్ వద్ద 'BMW' దూసుకెళ్లడం ఖాయం. మరి ఈ 13న మాస్ రాజా తన మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారో లేదో చూడాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి