ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో మారాల్సిందే. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు కూడా ట్రెండ్ ను బట్టి, మార్కెట్ ను బట్టి మారుతూ ఉంటారు. ముఖ్యంగా కథ విషయంలో అయినా, రెమ్యూనరేషన్ విషయంలో అయినా ఇలాంటి పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. హీరో రవితేజ గతంలో రెమ్యూనరేషన్ దగ్గర చాలా స్ట్రీట్ గా ఉండే వారిని ఇండస్ట్రీలో టాక్ వినిపించేది. ముందు ఎంత రెమ్యూనరేషన్ మాట్లాడుకుంటారో అంత రెమ్యూనరేషన్ తీసుకుంటారని, సినిమా హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా రూ. 25 కోట్లు తీసుకునేవారిని ఇండస్ట్రీ వర్గాలలో సమాచారం.


కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే అలా కనిపించడం లేదు. జనాలు కూడా పెద్దగా థియేటర్ కి రావడం లేదు నాన్ థియేటర్ ఆదాయం సగానికి సగం పడిపోయింది. కాబట్టి ఇలాంటి సమయంలో హీరోలు కూడా రూట్ మార్చి ప్రాపర్టీ షేరింగ్ విధానంలోకి ఒక్కొక్కరుగా మారుతున్నారు. లేకపోతే ఏదైనా ఏరియాలో సినిమా హక్కులను తీసుకునేలా చేయిస్తున్నారు నిర్మాతలు.ఈ విషయంలో మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ ఒక అడుగు ముందుకు వేసినట్లు వినిపిస్తోంది. ఇలాంటి ప్రయోగమే హీరో రామ్ తో మొదలుపెట్టి బేసిక్ రెమ్యూనరేషన్ ఇచ్చి ప్రాఫిట్ షేరింగ్ లో కొంత అనే పద్ధతిలో సినిమాని విడుదల చేశారు. అలాగే బేసిక్ రెమ్యూనరేషన్ కింద కూడా కొన్ని ఏరియాల హక్కులను అప్పగించేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


ఇప్పుడు రవితేజ కూడా మారిపోయి తాను  నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా బేసిక్ రెమ్యూనరేషన్ , ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలోనే తీసుకునేలా డీల్ కుదుర్చుకున్నారు. అలాగే ప్రస్తుతం సినిమా షూటింగ్లో ఉన్న మైత్రి , శివ నిర్వాణ సినిమాకు కూడా ఇదే పద్ధతిలోనే తీసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో రవితేజ బేసిక్ రెమ్యూనరేషన్ రూ.8 కోట్లు ఇవ్వగా ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ మీదనే ఈ సినిమాని ఓకే చెప్పినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా హీరోలు అందరూ కూడా ఇదే పద్ధతిలో కొనసాగితే ఇండస్ట్రీ బాగుండడమే కాకుండా నిర్మాతలకు కూడా ఇబ్బందులు తలెత్తవనే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: