టాలీవుడ్ ఇండస్ట్రీ లో తక్కువ సమయంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన జాతి రత్నాలు , మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఈయన అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను రేపు అనగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ రోజు అనగా జనవరి 13 వ తేదీన ప్రదర్శించనున్నారు. ఇప్పటివరకు నవీన్ హీరోగా నటించిన మూడు సినిమాలు మంచి విజయాలను అందుకోవడం , అనగనగా ఒక రాజు మూవీ కి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ బుక్ మై షో లో ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఆఖరి 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించిన 14.58 కే టికెట్లు బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి. ప్రస్తుతం కూడా బుక్ మై షో యాప్ లో ఈ మూవీ కి మంచి సేల్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతం మంచి అంచనాలు ఉండడం , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా జోరు మీద జరుగుతుండడంతో ఈ మూవీ కి మంచి టాక్ వస్తే ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేయడం పక్క అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: