ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాల మధ్య రూపొందే పెద్ద సినిమాలు ప్రకటించిన తేదీకి విడుదల కావడం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల విడుదల తేదీలు మారుతూ ఉండటం ప్రేక్షకులను ఒకింత నిరాశకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే మార్చి నెలలో సందడి చేయాల్సిన 'ది ప్యారడైజ్', 'పెద్ది' సినిమాలు వాయిదా పడనున్నాయని స్పష్టమైపోయింది. 'ది ప్యారడైజ్' మూవీ జూన్ లేదా జులై నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండగా, అందరి దృష్టి ఇప్పుడు 'పెద్ది' సినిమాపైనే నెలకొంది.
ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలను బట్టి చూస్తే ఆ తేదీన సినిమా రావడం కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ పనులు లేదా గ్రాఫిక్స్ పనుల కారణంగా మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా, 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించి చిత్ర యూనిట్ త్వరగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయమని, వసూళ్ల సునామీ సృష్టించడం పక్కా అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మేకర్స్ ఈ సస్పెన్స్‌కు ఎప్పుడు తెరదించుతారో చూడాలి. పెద్ది సినిమాలో చివరి 30 నిమిషాలు వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. ఎన్ని అంచనాలు పెట్టుకుని వెళ్లినా ఈ సినిమా ఆ అంచనాలను మించి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి