తెలుగు బుల్లితెర సినియర్ నటిగా పేరు సంపాదించిన వాహిని (పద్మ) కన్నుమూశారు. ఈమె గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ బుధవారం తన స్వస్థలమైన విజయనగరం లో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి కరాటే కళ్యాణి తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. గత కొంతకాలంగా వాహిని క్యాన్సర్ తో పోరాడుతూ వైద్య ఖర్చులకోసం సహాయం చేయాలని అందరిని కోరింది. దీంతో చాలామంది సీనియర్ యాక్టర్స్ కూడా వాసవి పరిస్థితి పైన పందించారు.



కరాటే కళ్యాణిఫేస్ బుక్ లో ఇలా రాసుకుంటూ.. వాహిని అక్క నిన్ను కాపాడుకోవాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ అది సాధ్యపడలేదు. కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలమైన విజయనగరంలో స్వామిని చేరుకుంది.. వైద్యులు కూడా మొన్న చెప్పేశారు, ఇక కష్టమని దీంతో కుటుంబ సభ్యులు ఊరికి తీసుకెళ్లిపోయారంట.. ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ నిన్ను చాలా మిస్ అవుతున్నాం పద్మక్క.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న అంటూ  ఫేస్ బుక్ లో ఒక నోట్ రాసుకొచ్చింది కరాటే కళ్యాణి. ఈ విషయం విన్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు   ఈమెకు సంతాపం తెలియజేస్తున్నారు.



నటి వాహిని విషయానికి వస్తే.. 1978లో విజయనగరంలో జన్మించిన ఈమె సినీ రంగంలో జయవాహిని పేరుతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె తెలుగు, తమిళం భాషలలో కూడా పలు సీరియల్స్ లలో నటించింది. అంతేకాకుండా ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే ఈమెకు బాగా పేరు తీసుకువచ్చేలా చేశాయి. చివరిగా బహిర్భూమి అనే చిత్రం లో నటించింది. ఆ తర్వాత అటు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల రీల్స్ తో అభిమానులను ఆకట్టుకుంది నటి  వాసవి. కానీ చివరికి వారం రోజున క్యాన్సర్ వారితో మరణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: