టాలీవుడ్ పాపులర్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. క, కే ర్యాంప్ సినిమాలతో కిరణ్ అబ్బవరం రేంజ్ పెరిగింది. కిరణ్ అబ్బవరం హీరోగా పాపులర్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా, జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్‌తో కలిసి భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమా మైథలాజికల్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
కీర్తన్ సహ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హై టెక్నికల్ వాల్యూస్, గ్రాండ్ విజువల్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పాపులర్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమా టైటిల్, డైరెక్టర్, ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది.
ఎమోషన్స్, డ్రామా, యాక్షన్ సీన్స్ తో పాటు స్పిరిట్యుయాలిటీతో కూడిన ఈ కథ అద్భుతంగా వచ్చిందని ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరనుందని తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరంను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
కిరణ్ అబ్బవరం కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించాలని అయన అభిమానులు భావిస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కిరణ్ అబ్బవరం ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తారో చూడాల్సి ఉంది. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం కంటెంట్ కు ప్రాధాన్యత ఉన్న స్క్రిప్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి