కథ :
కోమల్ (విశ్వక్ సేన్) ఫంకీ అనే టైటిల్ తో 4 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తానని నిర్మాతకు చెప్పి సినిమా బడ్జెట్ ను 40 కోట్ల రూపాయలకు పెంచుతారు. ఈ ఖర్చులు భరించలేక నిర్మాత టెన్షన్ పడటంతో మిగతా సీన్స్ ను కోటి రూపాయలతో పూర్తి చేయిస్తానని చిత్ర (కాయదు లోహార్) తండ్రికి మాటిస్తుంది. ఆ తర్వాత కోమల్, చిత్ర మధ్య ఏం జరిగింది? కోటి రూపాయలతో సినిమా పూర్తయిందా? ఎమోషన్స్ లేని కోమల్ తన తల్లి విషయంలో ఎలా వ్యవహరించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
ఫంకీ సినిమా టీజర్, ట్రైలర్ హిలేరియస్ గా ఉన్నాయి. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని భావించిన ప్రేక్షకులు మాత్రం నిరాశకు లోనవుతారు. ఫస్టాఫ్ ఓకే అనిపించినా సెకండాఫ్ స్క్రీన్ ప్లే విషయంలో చేసిన తప్పులు సినిమాకు మైనస్ అయ్యాయి. స్క్రిప్ట్ విషయంలో పొరపాట్లు దొర్లాయి. తన రెగ్యులర్ మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, ఒక అమాయకపు డైరెక్టర్‌గా విశ్వక్ పర్ఫార్మెన్స్ కొత్తగా ఉంది. కొన్ని సీన్లలో అనుదీప్ రాసిన ప్రాసలు, సిల్లీ జోకులు థియేటర్లో నవ్వులు పూయిస్తాయి.
దిల్ రాజు, నాగవంశీ, హరీష్ శంకర్ వంటి ప్రముఖులు క్యామియో రోల్స్‌లో కనిపించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. సినిమా నిడివి తక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. అయితే ద్వితీయార్థంలో వచ్చే 'పెళ్లి చూపుల సీన్' వంటివి మరీ సిల్లీగా ఉండి సహనాన్ని పరీక్షిస్తాయి. కేవలం జోకుల మీదే సినిమాను నడిపించే ప్రయత్నం చేయడం వల్ల ఎమోషన్స్ పండలేదు.
భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ లో ధీరే ధీరే, రట్ఠాట్టావ్ సాంగ్స్ బాగుండగా మిగతా సాంగ్స్ నిరాశ పరిచాయి. బీజీఎమ్ ఆశించిన స్థాయిలో లేదు. ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమా విషయంలో ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పవచ్చు. సినిమా సీన్స్ మధ్య ఫ్లో ప్రేక్షకులకు చిరాకు తెప్పించేలా ఉంది. కొన్ని సీన్స్ తలా తోకా లేకుండా ఎండ్ అవుతాయి. సినిమా రన్ టైం తక్కువగా ఉండటం మంచిదే కానీ సీన్స్ మధ్య కనెక్షన్ మిస్ కావడం వల్ల ప్రేక్షకులకు తెరపై ఏం చూస్తున్నామో అనే గందరగోళం కూడా వెంటాడుతుంది.
హీరోయిన్ కాయదు లోహార్ కు మాత్రం ఈ సినిమా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆమె తెరపై ఒకింత అందంగా కనిపించారు. తెలుగులో ఆమెకు మరిన్ని ఆఫర్లు రావడం పక్కా అని చెప్పవచ్చు. 12 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ను మరింత బెటర్ గా రాసుకుని ఉంటే బాగుంటుంది.
రేటింగ్ : 2.5/5.0
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి