ఆరడుగుల అందగాడు ప్రభాస్ 50 ఏళ్ళు దగ్గర పడుతున్నా పెళ్లికి మాత్రం దూరమే.. ప్రభాస్ పెళ్లి వార్తలు ఇప్పటికే చాలాసార్లు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ పెద్దమ్మ ప్రతిసారి మీడియా ముందుకు వచ్చినపుడు తన కొడుకు పెళ్లి అప్పడు ఇప్పుడు అని మాటలు చెప్పి దాటేయడం తప్ప అది జరిగింది లేదు మనం చూసింది లేదు అన్న తీరులో ఉంది.అలాగే ప్రభాస్ కి కూడా పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించడం లేదు. అలాగే ప్రభాస్ పెళ్లి చూడాలి అనేది ఆయన అభిమానులందరి కల.కానీ ఆ కల నెరవేరుతుంది అన్న గ్యారెంటీ మాత్రం అభిమానుల్లో లేదు. అయితే చాలా రోజులుగా ప్రభాస్,అనుష్క ఇద్దరు ప్రేమలో ఉన్నారని, కచ్చితంగా వీరిద్దరే పెళ్లి చేసుకుంటారని మాట్లాడుకుంటున్నారు.

 అందుకే అనుష్క కూడా పెళ్లి చేసుకోకుండా దూరంగా ఉందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే గతంలో ప్రభాస్ త్రిషని పెళ్లి చేసుకోవాలనుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ప్రేమ వార్తలు చాలానే చక్కర్లు కొట్టాయి. ఈ విషయం పక్కన పెడితే.. ప్రభాస్ కి మరో హీరోయిన్ తో కూడా డేటింగ్ వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్.. కాజల్,ప్రభాస్ కాంబినేషన్లో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్సే. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి.కానీ ఈ వార్తలను వీరిద్దరూ ఖండించలేదు సమర్దించలేదు.ఇదంతా పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. 

ఆ వీడియోలో ప్రభాస్ కాజల్ ఇద్దరు ఒకరికొకరు కేక్ తినిపించుకొని సరదాగా ఉన్నారు. అయితే ఈ వీడియో ఏ సినిమా సెలబ్రేషన్స్ సమయంలో తీసారో తెలియదు కానీ చాలామంది ఈ వీడియోని వైరల్ చేస్తూ ప్రభాస్, కాజల్ మధ్య నిజంగానే అప్పట్లో ఎఫైర్ నడిచింది అని మాట్లాడుకుంటున్నారు.అయితే ఈ వీడియోని షేర్ చేసిన ఒక నెటిజన్ ప్రభాస్,కాజల్ ఇద్దరు సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. కానీ అంకుల్ ఒప్పుకోకపోవడం వల్ల వీళ్ళిద్దరికీ బ్రేకప్ జరిగింది అని క్యాప్షన్ పెట్టడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇక ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోక పోయినప్పటికీ కాజల్ మాత్రం తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి గౌతమ్ కిచ్లూని పెళ్ళాడి ఒక బాబుకి జన్మనిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: