టాలీవుడ్‌లో 'యమదొంగ' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తన చలాకీతనంతోనూ, అద్భుతమైన గాత్రంతోనూ కుర్రకారు గుండెల్లో మంటలు రేపిన మలయాళ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం నటిగానే కాదు, సింగర్‌గా కూడా మెప్పించిన ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఎన్నో అగ్నిపరీక్షలను ఎదుర్కొంది. క్యాన్సర్ వంటి మహమ్మారిని రెండుసార్లు జయించి రియల్ లైఫ్ ‘వార్యర్’ అనిపించుకున్న మమత.. తాజాగా తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, మోసాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇటీవల నటి సుహాసిని మణిరత్నం నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మమత, తన జీవితంలోని అత్యంత చీకటి కోణాలను బయటపెట్టింది. ఆమె మాటల ప్రకారం.. క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో, ఒక మహిళగా తనకున్న చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవాలని భావించిందట. ఆ సమయంలో మలయాళ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడు ఆమెను డేటింగ్ అడిగాడు. ఆశ్చర్యకరంగా.. మమత తల్లి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ నటుడికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం (Engagement) అయిపోయింది. ఆ నిజాన్ని దాచిపెట్టి మమతతో డేటింగ్ చేశాడట."ఒక అమ్మాయి నమ్మకాన్ని బద్ధలు కొట్టడానికి ఎలా మనసు వస్తుంది?" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.



మమత తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్‌ను 2011లో ఘనంగా వివాహం చేసుకుంది. అయితే అందరూ ఆ జంట నిండు నూరేళ్లు కలిసి ఉంటుందని భావిస్తే.. కేవలం 6 నెలలకే విడాకుల ప్రకటన ఇచ్చి షాక్ ఇచ్చారు. పెళ్లయిన ఏడాదిలోపే ఈ బంధం ముగిసిపోవడానికి కారణం కానీ అంతలోనే ఆమె క్యాన్సర్ బారిన పడడం.. పెళ్లయిన ఏడాదికే విడాకులు తీసుకోవడం.. ఇలా ఏడాదిలో తన జీవితంలో చాలా జరిగిపోయాయి. క్యాన్సర్ కారణంగానే విడాకులు అయ్యాయనే వార్తలు కూడా వచ్చాయి. ఇన్ని కష్టాలు, మోసాలు ఎదురైనా మమత ఎక్కడా వెనకడుగు వేయలేదు. జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్న ఆమె.. రెండో పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. "జీవితం చాలా అందమైనది. మనసులో ఉన్న నెగెటివ్ ఆలోచనలను వదిలేసి ముందుకు సాగాలి. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి, నాకు తోడుగా నిలిచే వ్యక్తి దొరికితే ఖచ్చితంగా మళ్ళీ వివాహం చేసుకుంటాను" అని బోల్డ్ గా స్టేట్‌మెంట్ ఇచ్చేసింది.


మొత్తానికి మమతా మోహన్ దాస్ లైఫ్ ఒక సినిమా స్టోరీ కంటే తక్కువేం కాదు. కష్టాలు వచ్చాయని కుంగిపోకుండా, మోసపోయానని వెనక్కి తగ్గకుండా.. "నెక్స్ట్ ఏంటి?" అనే ధైర్యంతో ఆమె ముందుకు వెళ్తుండటం నిజంగా గ్రేట్. తన మనసు విప్పి మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మమత త్వరలోనే ఒక మంచి భాగస్వామిని పొంది, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశిద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: