టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. 2026 సంక్రాంతి కానుకగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో చిరంజీవి కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు వరుసగా 9 విజయాలను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా ఏంటనే విషయంపై గత కొద్ది రోజులుగా ఏవేవో రూమర్స్ వినిపించాయి. కానీ తాజాగా అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలకు చెక్ పెడుతూ కొత్త సినిమాని ప్రకటించారు.


ముఖ్యంగా ఏ హీరోతో వస్తారు? ఎలాంటి కంటెంట్ తో వస్తారు అనే విషయంపై అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా వాటికి ఎండ్ కార్డు వేస్తూ.. ఈ ప్రాజెక్టు కోసం మరొకసారి ఇద్దరి స్టార్స్ ని కలుపుతున్నారు అనిల్ రావిపూడి. ఆ స్టార్స్ ఎవరో కాదు తనకు మొదటిసారి రూ.100 కోట్ల సినిమా ఇచ్చిన విక్టరీ వెంకటేష్, అలాగే తనకు మొదటిసారి అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ తో క్రేజీ మల్టీస్టారర్ మూవీని తీయబోతున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించారు.



ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు అనిల్ రావిపూడి. ఈసారి కూడా ఈ చిత్రాన్ని సంక్రాంతి (2027) లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించి ఒక వీడియోని మెన్షన్ చేస్తూ 2027 సంక్రాంతికి కూడా బ్లాక్ బాస్టర్ హిట్ తో  స్టార్ట్ చేయడానికి సిద్ధం అయ్యాము అంటూ తెలిపారు. ఈ న్యూస్ తెలిసిన పలువురు నేటిజన్స్ అసలు ఈ క్రేజీ కాంబినేషన్ ఎవరు ఊహించలేదు. వెంకటేష్ ,కళ్యాణ్ రామ్ క్రేజీ కాంబో బొమ్మ సూపర్ హిట్  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలు కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: