అదేమిటంటే భార్య సంగీత ,విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు జిల్లా కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేసినట్లుగా వినిపిస్తున్నాయి. త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. గత ఏడాది నుంచే అటు సంగీత, విజయ్ మధ్య విడాకుల రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విడాకుల రూమర్స్ విషయం పైన ఏ ఒక్కరు స్పందించలేదు. ప్రస్తుతం ఈ విషయం తమిళనాడు రాజకీయాలలో మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. విజయ్ 1999లో సంగీతను వివాహం చేసుకోగా ఈ జంటకు జాసన్ సంజయ్, దివ్యసాష అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.
2023లో విజయ్ ,సంగీత మధ్య గొడవలు మొదలయ్యాయని ఆ గొడవలే ఇప్పుడు విడాకులకు కారణమవుతున్నాయనే విధంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎఫైర్ వల్లే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయనే విధంగా కూడా రూమర్స్ వినిపించాయి. ఇప్పటివరకు విడాకులు వార్తల పైన ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం విజయ్ మాత్రం పొలిటికల్ పైనే ఫోకస్ చేసినట్లుగా వినిపిస్తున్నాయి. విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జననాయగన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతోంది.. విజయ్ చివరి సినిమా కావడం చేత భారీ విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి