బాక్స్ ఆఫీస్ వద్ద ఎప్పుడు కూడా బడా సినిమాలు పోటీ పడుతుంటాయి. అలా మార్చి 19వ తేదీన దురంధర్ 2 చిత్రంతో పాటుగా యష్ నటించిన టాక్సిక్ సినిమా ఒకేరోజు విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మార్చి 19 బాక్స్ ఆఫీస్ వద్ద వార్ కన్ఫర్మ్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా ఈ పోటీ నుంచి టాక్సిక్ సినిమా పోస్ట్ పోన్ చేసుకుంది. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల టాక్సిక్ సినిమాని జూన్ 4వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్ర బృందం ప్రకటించారు.


దీంతో దురంధర్ 2 చిత్రానికి లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. దురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా ఓటిటిలో కూడా అదిరిపోయే రెస్పాస్ లభించింది. ఈ నేపథ్యంలోనే దురంధర్ 2 సినిమాకి సంబంధించి ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది. దురంధర్ 2 చిత్రం ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పైన నెలకొన్న అంచనాల వల్ల ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


మొదటి భాగం కేవలం ఒకే భాషలో విడుదల చేసిన రూ.1400 కోట్ల రూపాయలు కొల్లగొట్టేది దురంధర్. రన్వీర్ సింగ్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. అందుకే దురంధర్ 2 సినిమా ఏకంగా రూ .20000వేల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుందంటూ అభిమానులు, ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఇరాన్, ఇజ్రాయిల్ వారు కారణంగా దురంధర్ 2 చిత్రానికి బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. మరి దురంధర్ 2 చిత్ర బృందం మారుతి 19న ఈ సినిమాను విడుదల చేస్తారా యుద్ధం కారణంగా వాయిదా వేస్తారా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: