ఈ మధ్యకాలంలో చాలామంది సౌత్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలు పెళ్లి చేసుకోగా.. మరోవైపు అల్లు శిరీష్ నైనిక రెడ్డిల పెళ్లి కూడా జరిగింది.అలా హీరోలు వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు గుడ్ న్యూస్ చెబుతూ పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నట్టు తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్థమవుతుంది. గత కొద్దిరోజుల నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి జరగబోతుంది అని వస్తున్న ప్రచారానికి ఈరోజుతో తెర పడింది. ఈరోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాను ప్రేమించిన అమ్మాయితో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.అయితే ఈ ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన అభిమానులతో షేర్ చేసుకోకపోయినప్పటికీ ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ కి బోయపాటి శ్రీను హీరొయిన్ సంయుక్త మీనన్ వచ్చారు. మరి ఇంతకీ బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అల్లుడు శీను అనే మూవీతో ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమా హిట్ కొట్టినప్పటికీ అంతగా అవకాశాలు రాకపోవడంతో అడపాదడపా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.ఇక గత ఏడాది కిష్కింధపురి, భైరవం వంటి రెండు సినిమాలతో అలరించారు. 

అలాంటి ఈ హీరో తాజాగా హైదరాబాద్ కు చెందిన కావ్య రెడ్డి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే కావ్య రెడ్డికి బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్యామిలీ కి మధ్య చాలా రోజుల నుండి సంబంధం ఉందట.ఇక కావ్య రెడ్డి తండ్రి లాయర్ కాగా.. తాత జడ్జి అని తెలుస్తోంది. అలా హైదరాబాద్ కు చెందిన కావ్య రెడ్డితో చాలా రోజుల నుండి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమలో ఉన్నారట. అలా ఫైనల్గా ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి పీటలెక్కబోతున్నారట. ఇక సినీ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ఈ జంట పెళ్లి కూడా ఈ ఏడాదే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఫైనల్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి వైవాహిక బంధం లోకి అడుగు పెట్టబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: