ఉపాసన అంటే కేవలం తన తమ్ముడు భార్య మాత్రమే కాదని తనకి ఒక మంచి స్నేహితురాలు అంటూ తెలియజేసింది. ఉపాసన వ్యక్తిగతం గురించి మాట్లాడుతూ ఆమె ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉన్న చాలా ప్రశాంతంగానే ఆలోచిస్తుంది. ఉపాసన ఎలాంటి విషయాన్నైనా సరే నెగిటివ్గా లేదా సీరియస్గా తీసుకోదు. ప్రతి పరిస్థితిని చాలా లైట్ గా తీసుకుంటుందని తెలిపింది సుష్మిత. అందుకే ఇంటి వాతావరణం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేలానే చూసుకుంటుందని తెలిపింది. ఉపాసనకు ఆహారం అంటే చాలా ఇష్టం , వాటిని తయారు చేయడమన్న ఇతరులకు వడ్డించడం అంటే మరి ఇష్టమని తెలిపింది.
అందరికీ మంచి పోషకాహారం అందించాలని ఉద్దేశంతోనే అత్తమ్మ కిచెన్ ని మొదలుపెట్టారు. ఆరోగ్యం విషయంలో ఆమెకి ఉన్న అవగాహన వల్లే కుటుంబం మొత్తానికి చాలా ఉపయోగపడుతుంది అంటూ తెలిపింది. అలాగే ఉపాసనాకు పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలకు సెలవులు వచ్చాయని తెలిస్తే చాలు వారిని ఇంటికి పిలిపించుకొని మరి వారితో సరదాగా గడుపుతుందని, క్లింకార రాకతో మెగా ఇంట్లో సందడి మరింత పెరిగిపోయిందని ఒక తల్లిగా ఉపాసన అన్ని బాధ్యతలను చాలా బ్యాలెన్స్ చేస్తోందని తెలిపింది. వృత్తిరీత్యా బిజినెస్ సుమన్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఉపాసన కుటుంబ సభ్యులతో ఎక్కువగా తన సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇస్తుందంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి