బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమాపై ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో భారీగా చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో చిరంజీవి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. కథ నుంచి నటీనటుల ఎంపిక వరకు ప్రతి అంశాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తూ, సినిమా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్శకుడు బాబీ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించే నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియలో ఆయన చాలా శ్రద్ధగా పనిచేస్తున్నట్టు సమాచారం. కథకు సరిపోయేలా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా క్యాస్టింగ్ చేయాలని దర్శకుడు భావిస్తున్నారని చెబుతున్నారు.ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉన్నట్టే, ఆయన అన్నయ్య పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందట. ఈ పాత్ర కథలో భావోద్వేగాన్ని పెంచే విధంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మొదట ఈ పాత్ర కోసం కొంతమంది ప్రముఖ హీరోలను పరిశీలించినప్పటికీ, చివరికి దర్శకుడు సూపర్ స్టార్ రజినికాంత్ పేరును ఫైనల్ చేసినట్టు సమాచారం.

చిరంజీవికి అన్నయ్యగా కనిపించే పాత్రకు రజనీకాంత్ అయితేనే సరైన ఎంపిక అవుతారని దర్శకుడు భావించినట్టు చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఉన్న స్టార్‌డమ్, వారి స్క్రీన్ ప్రెజెన్స్, అలాగే అభిమానుల్లో ఉన్న క్రేజ్ అన్ని కలిసి ఈ పాత్రను మరింత గొప్పగా చూపిస్తాయని ఆయన నమ్మకం. ఈ విషయంపై చిరంజీవి స్వయంగా రజనీకాంత్‌తో మాట్లాడినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కథ వినిపించిన తర్వాత రజనీకాంత్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.ఇక ఈ సినిమాలో ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ఆయన పాత్ర కూడా కథలో కీలక మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. చిరంజీవి, మోహన్ లాల్ వంటి దిగ్గజ నటులతో పాటు రజనీకాంత్ కూడా ఈ సినిమాలో భాగమైతే, అది నిజంగా భారతీయ సినీ పరిశ్రమలో ఒక అరుదైన కలయికగా మారుతుంది అని అభిమానులు భావిస్తున్నారు.

ఇలాంటి స్టార్ కాంబినేషన్ ఒకే సినిమాలో కనిపించడం చాలా అరుదు. అందుకే ఈ సినిమా గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకే తెరపై చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ లాంటి స్టార్‌లు కనిపిస్తే అది ఖచ్చితంగా ఇండియా వైడ్‌గా భారీ సంచలనంగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: