తల్లిగా మారిన తర్వాత అలియా ఆలోచనా ధోరణిలో భారీ మార్పు వచ్చింది. తన కూతురు రాహా భట్ లాంటి చిన్నారులకు అద్భుతమైన కథలను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించింది.తన మెయిన్ బ్యానర్‌కు ఈ ‘ఎటర్నల్ కిడ్స్’ ఒక చిన్నారి లాంటిదని అలియా అభివర్ణించింది. "మా చిన్నప్పుడు మేము విని పెరిగిన కథలను మళ్ళీ సజీవం చేయబోతున్నాం" అంటూ అలియా ఎమోషనల్ అయ్యారు. పిల్లల ప్రపంచంలో ఉండే ఆ అమాయకత్వాన్ని, అద్భుతాలను వెండితెరపై ఆవిష్కరించడమే ఈ బ్యానర్ ముఖ్య ఉద్దేశం.
అలియా కేవలం ప్రకటనతో ఆగిపోలేదు, అప్పుడే పని మొదలుపెట్టేసింది. ఈ కొత్త బ్యానర్‌లో ఇప్పటికే మూడు క్రేజీ ప్రాజెక్టులు పట్టాలెక్కడం విశేషం. ‘సీ’ (C), ‘జీ’ (G), ‘ఎం’ (M) అనే వర్కింగ్ టైటిల్స్‌తో మూడు సినిమాలు సెట్స్ పైకి వెళ్తున్నాయి. గతంలో ‘డార్లింగ్స్’, ‘జిగ్రా’ వంటి సినిమాలతో నిర్మాతగా తన సత్తా చాటిన అలియా, ఇప్పుడు కిడ్స్ కంటెంట్‌తో మరో భారీ సక్సెస్‌ను అందుకోవాలని కసితో ఉంది.అలియా భట్ మాత్రం తన ‘ఎటర్నల్’ ప్లానింగ్‌తో దూసుకుపోతోంది. భర్త రణబీర్ కపూర్ ‘రామాయణం’ ఒకవైపు, అలియా ప్రొడక్షన్ విశేషాలు మరోవైపు నెట్టింట పూనకాలు తెప్పిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి