మధ్యప్రదేశ్ కు చెందిన మోనాలిసా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది. మోనాలిసా బోస్లే కి ఏకంగా హీరోయిన్గా కూడా పలు సినిమాలలో నటించే అవకాశాలు లభించాయి. ముఖ్యంగా తన కళ్ళతో అందరిని ఆకర్షించిన మోనాలిసా తెలుగు సినీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టడానికి సిద్ధమయ్యింది. ఇటువంటి సందర్భంలోనే ఊహించని విధంగా ఇటీవల ప్రేమ వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది మోనాలిసా. మోనాలిసా వివాహం జరిగిన తర్వాత లవ్ జిహాద్ వివాహమని, ఏవేవో కారణాలు వైరల్ గా మారాయి.



అయితే ఇప్పుడు తాజాగా మోనాలిసా పెళ్లి చెల్లదని ఆమె అంకుల్ విజయ్ బోస్లే ఆరోపణలు చేస్తున్నారు. మోనాలిసా ఈ మధ్యనే పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. గత కొన్ని నెలలుగా ఫర్మాన్  ఖాన్  అనే ముస్లిం యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. తన తండ్రికి ఇష్టం లేని వివాహం చేసుకున్న మోనాలిసా తన తల్లిదండ్రుల మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కొంతమంది రాజకీయ నాయకులు మోనాలిసా వివాహాన్ని దగ్గరుండి మరి కేరళలో జరిపించారు. మోనాలిసా వివాహాన్ని ఆమె తల్లిదండ్రులే కాకుండా బంధువులు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్లు వినిపిస్తున్నాయి.


మోనాలిసాకు ఇంకా వివాహం చేసుకొనే వయసు రాలేదని మోనాలిసా  మైనర్ అంటూ 2009లో పుట్టిందని ఆమె అంకుల్ విజయ్ బోస్లే వెల్లడిస్తున్నారు. పాస్పోర్ట్ పత్రాలలో కేవలం ఆమె వయసు ఎక్కువ చూపించి మోసం చేస్తున్నారని, మోనాలిసా మేజర్ కాదు కాబట్టే చట్టపరంగా ఫర్మాన్ ఖాన్ తో వివాహం చెల్లదంటూ తెలియజేశారు. అనంతరం కేరళ ప్రభుత్వం జారీ చేసిన తన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా మోనాలిసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో చట్టపరంగానే ఫర్మాన్ ఖాన్ తో తన వివాహం జరిగిందని మోనాలిసా అందరికీ తెలియజేసింది. మోనాలిసా పైన డైరెక్టర్ సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. ఆమె వివాహం లవ్ జిహాదీ అని పేర్కొన్నారు. మోనాలిసా ను తానే ట్రైనింగ్ ఇచ్చి సినీ ఇండస్ట్రీలోకి తీసుకువచ్చాను ఆమె జీవితాన్ని మార్చడానికి చాలా కష్టపడ్డాను కానీ జరిగిన పరిణామాలన్నీ తనని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయంటూ సనోజ్ మిశ్రా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: