బాలీవుడ్లో భారీ అంచనాల మధ్య మార్చి 19న విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం దురంధర్ 2. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆదిత్యధర్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ నటించిన నటన కూడా ఈ సినిమాకి మరింత హైలెట్ అని చెప్పవచ్చు. గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకున్న దురందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ .1300 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో ఒక సునామి సృష్టించింది. ఇప్పుడు అన్ని భాషలలో దురంధర్ 2 సినిమా విడుదల చేయాలనుకున్నప్పటికీ కేవలం హిందీలో తప్ప మిగిలిన భాషలలో టెక్నికల్ సమస్యల వల్ల విడుదల చేయలేదు.

కేవలం హిందీలో మాత్రమే అన్ని ప్రాంతాలలో విడుదల చేయగా భారీ రెస్పాన్స్ లభిస్తోంది. మరి కొద్ది రోజులలో అన్ని భాషలలో కూడా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్ర బృందం. అయితే ఇటువంటి తరుణంలోనే టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సైతం దురంధర్ 2 సినిమాని చూసి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తదితర సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.


అయితే ఈ సినిమా పై వస్తున్న ప్రశంశల వెనుక రాజకీయ ఒత్తులు ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా  స్పందించారు. ఉత్తరాదిన తరచు ఎక్కువగా వినిపించే ఒత్తిడి రాజకీయాలలో ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలోకి కూడా వచ్చేసాయని అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి సినిమాలను రిమోట్ చేయవలసిన పరిస్థితి స్టార్ హీరోలకు వచ్చింది అంటూ బిజెపి పార్టీని ఉద్దేశిస్తూ విమర్శలు సైతం చేశారు ప్రకాష్ రాజు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయం టాలీవుడ్ లో మరొకసారి వైరల్ గా మారింది. మరి ప్రకాష్ రాజ్ కు ఎవరు కౌంటర్ వేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: