ఈ సినిమా చూసి డబ్బులు టైం వృధా చేసుకోకండి డైరెక్టర్ గాని డైలాగ్స్ గాని ఎడిటింగ్ కానీ ఇవేవీ కూడా బాగోలేవు. డైరెక్టర్ ఆదిత్య ధర్ మీ మితిమీరిన జాతీయ వాదం దుష్ప్రచారాన్ని ఆపండి అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. దీంతో పలువురు నేటిజన్స్ సైతం ఈ ట్వీట్ పైన పలు రకాలుగా స్పందిస్తున్నారు. దురంధర్ చిత్రంలో ప్రధాని మోదీ సహ బీజేపీ ప్రభుత్వాన్ని ఎలివేషన్ ఇచ్చినట్లుగా కనిపిస్తోందని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లుగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రమ్య ఈ విధంగా స్పందించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆదిత్య ధర్ డైరెక్షన్లో రూపొందిన దురంధర్ సినిమా గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలయ్యింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో సీక్వెల్ ను మార్చి 19న దురంధర్: ది రివెంజ్ రూపొందించారు. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ కి జోడిగా సారా అర్జున్ నటించిగా కీలకమైన పాత్రలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ మరి కొంతమంది నటీనటులు నటించారు. దురంధర్ 2 చిత్రం ఇప్పటికీ రూ. 330 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరేన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి