టాలీవుడ్ ‘ఛార్మింగ్ స్టార్’ శర్వానంద్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర తన గేర్ మార్చారు. పక్కా క్లాస్ సినిమాలతో మెప్పించే శర్వా, ఈసారి ఇండియాలోనే ఫస్ట్ టైమ్ ‘బైక్ రేసింగ్’ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ‘బైకర్’ (Biker) మూవీతో ఒక సరికొత్త రికార్డుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ నెట్టింట సెగ పుట్టిస్తుంటే, దానికి ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్ ఇప్పుడు ‘మాస్’ లెవల్లో వైరల్ అవుతోంది.


తన స్నేహితుడు శర్వానంద్ కోసం ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ‘బైకర్’ ట్రైలర్ చూసిన ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో అదిరిపోయే కామెంట్ చేశారు. "బైకర్ ట్రైలర్ వైబ్ అదిరిపోయింది! చాలా ఎంగేజింగ్‌గా ఉంది. శర్వా, యూవీ క్రియేషన్స్ అండ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్" అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ నుంచి ఇలాంటి అప్రిసియేషన్ రావడంతో ‘బైకర్’ టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. చిరంజీవి ‘విశ్వంభర’ లాంటి మెగా ప్రాజెక్టులను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్, ఈ రేసింగ్ డ్రామాను కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించింది.



ఈ సినిమాలో శర్వానంద్ సరికొత్త లుక్‌తో మెరిసిపోతుంటే, మరోవైపు యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రాజశేఖర్ మార్క్ యాక్షన్, శర్వానంద్ రేసింగ్ సీన్లు ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అభిలాష్ రెడ్డి తన మేకింగ్‌తో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూపించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫస్ట్ ఇండియన్ బైక్ రేసింగ్ సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.శర్వానంద్ ‘బైకర్’ ట్రైలర్ మాత్రం ఒక ప్రత్యేకమైన సెన్సేషన్ క్రియేట్ చేసింది. శర్వా ఏప్రిల్ లో తన రేసింగ్ తో రికార్డులు తిరగరాయడానికి రెడీ అయ్యారు.


https://www.instagram.com/reels/DWNqY2hj_4J/

మరింత సమాచారం తెలుసుకోండి: